OTT : ఈ వారం ఓటీటీల్లో రిలీజ్‌ అవుతున్న మూవీలు ఇవే..!

September 19, 2022 2:27 PM

OTT : ప్రతి వారం కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేసే విధంగానే ఓటీటీల్లోనూ కొత్త మూవీలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కరోనా పుణ్యమా అని ప్రేక్షకులు ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. దీంతో థియేటర్లలో మూవీలను చూసే వాళ్లు తక్కువయ్యారు. అయితే ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ఓటీటీ యాప్‌లు కూడా వారం వారం సరికొత్త మూవీలను తమ ప్లాట్‌ఫామ్‌లపై రిలీజ్‌ చేస్తున్నాయి. ఇక ఈ వారం కూడా పలు మూవీలు రిలీజ్‌ కానున్నాయి. ఈ వారంలో ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇటీవలే విడుదలైన ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో బాక్సాఫీస్‌ వద్ద దారుణమైన డిజాస్టర్‌గా మారింది. అయితే మూవీ ఓటీటీలో రిలీజ్‌ అవనుంది. ఈ మూవీ డిజిటల్‌ హక్కులను ఆహా ప్లాట్‌ఫామ్‌ కొనుగోలు చేసింది. కనుక ఆహాలో ఈ మూవీ రిలీజ్‌ కానుంది. సెప్టెంబర్‌ 23వ తేదీ నుంచి ఈ మూవీని స్ట్రీమ్‌ చేయనున్నారు. అలాగే తమన్నా లీడ్‌ రోల్‌లో నటించిన కామెడీ డ్రామా మూవీ బబ్లీ బౌన్సర్‌ కూడా ఈ వారమే ఓటీటీల్లోకి రానుంది. ఈ మూవీని డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో స్ట్రీమ్‌ చేస్తారు. 23వ తేదీన రిలీజ్‌ అవుతుంది.

movies and series releasing on ott on 23rd september 2022
OTT

ఇక జూహీ చావ్లా, అయేషా ఝుల్కా, సోహా అలీ ఖాన్‌, కరిష్మా తన్నా, కృతికా కామ్రాలు ప్రధాన పాత్రల్లో నటించిన ఫీమేల్‌ సెంట్రిక్‌ మూవీ హుష్‌ హుష్‌ కూడా నేరుగా ఓటీటీలోనే రిలీజ్‌ అవుతుంది. అమెజాన్‌ ప్రైమ్‌ ఒరిజినల్‌గా ఈ మూవీ రిలీజ్‌ అవుతోంది. సెప్టెంబర్‌ 22న రిలీజ్‌ చేస్తారు.

ఇక కార్దాషియన్స్‌ అనే సిరీస్‌ కు చెందిన రెండో సీజన్‌ను ఈ వారంలో స్ట్రీమ్‌ చేస్తారు. డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో 22వ తేదీ నుంచి స్ట్రీమ్‌ అవుతుంది. అలాగే తమిళ స్టార్‌ నటుడు ధనుష్‌ నటించిన తిరుచిత్రాంబళం అనే మూవీకి చెందిన తెలుగు వెర్షన్‌ను ఈ నెల 23న సన్‌ నెక్ట్స్‌లో స్ట్రీమ్‌ చేస్తారు. ఇలా పలు మూవీలు ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను అలరించనున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now