OTT : ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే..!

June 13, 2022 2:11 PM

OTT : వారం వారం థియేటర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను కొత్త కొత్త సినిమాలు అల‌రిస్తున్నాయి. అయితే మేమేం త‌క్కువ తిన‌లేదు.. అంటూ ఓటీటీ యాప్‌లు కూడా సినిమాల‌తో సంద‌డి చేస్తున్నాయి. వీటితోపాటు సిరీస్‌ల‌ను కూడా ఓటీటీ యాప్‌లు రిలీజ్ చేస్తున్నాయి. దీంతో వారం వారం కొత్త సినిమాలు, సిరీస్‌ల కోసం ఓటీటీ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ వారం కూడా ప‌లు ఓటీటీ యాప్‌ల‌లో నూత‌న సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ కానున్నాయి. వాటి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ వారంలో అమెజాన్ ప్రైమ్‌లో జ‌య‌మ్మ పంచాయితీ మూవీ స్ట్రీమ్ కానుంది. ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజ్ అయిన‌ప్ప‌టికీ నిరాశ ప‌రిచింది. దీన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 14వ తేదీన రిలీజ్ చేయ‌నున్నారు. యాంక‌ర్ సుమ చాలా ఏళ్ల త‌రువాత పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర‌లో చేసిన మూవీ ఇది. అయిన‌ప్ప‌టికీ ఈ సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రించ‌లేదు. లైట్ తీసుకున్నారు. ఇక ఓటీటీలో ఈ మూవీ ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న ఇస్తుందో చూడాలి.

movies and series releasing on June 17th 2022 on OTT
OTT

ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే ఈ నెల 14వ తేదీన అవ‌తార పురుష: పార్ట్ 1 అనే క‌న్నడ సినిమా రిలీజ్ కానుంది. థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో తెర‌కెక్కిన ఈ చిత్రంలో శ‌ర‌న్‌, అషికా రంగ‌నాథ్‌లు లీడ్ రోల్స్‌లో న‌టించారు. అలాగే జీ5 యాప్‌లో జూన్ 17వ తేదీన రెక్కీ అనే సిరీస్‌ రిలీజ్ కానుంది. ఇందులో శివ బాలాజీ, ఎస్థ‌ర్‌, ధ‌న్య బాల‌కృష్ణ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

ఇక డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ యాప్ లో జూన్ 17వ తేదీన ఓ2 అనే మూవీ రిలీజ్ కానుంది. త‌మిళంలో తెర‌కెక్కిన ఈ థ్రిల్ల‌ర్ మూవీలో న‌య‌న‌తార ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించింది. విగ్నేష్ శివ‌న్‌తో వివాహం అయ్యాక రిలీజ్ అవుతున్న తొలి సినిమా ఇదే కావ‌డం విశేషం. ఇలా ప‌లు మూవీలు, సిరీస్‌లు ఈ వారంలో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now