భారీ డిస్‌ప్లే, బ్యాట‌రీతో వ‌చ్చిన మోటో జి32 స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర ఎంతంటే..?

మొబైల్స్ త‌యారీదారు మోటోరోలా మ‌రో అద్భుత‌మైన ఫీచ‌ర్లు క‌లిగిన స్మార్ట్ ఫోన్‌ను భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. మోటో జి32 పేరిట లాంచ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్‌లో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఇందులో 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ కలిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల డిస్‌ప్లే క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది.

ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ స్నాప్ డ్రాగ‌న్ 680 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. 4జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ల‌భిస్తాయి. మెమొరీని కార్డు ద్వారా 1 టీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. అలాగే ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 12 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ల‌భిస్తుంది. దీన్ని భ‌విష్య‌త్తుల్లో ఆండ్రాయిడ్ 13 కు అప్ గ్రేడ్ చేసుకోవ‌చ్చు. అలాగే హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్ ఫీచ‌ర్ ఇందులో ఉంది.

ఈ ఫోన్‌లో వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేయ‌గా, మ‌రో 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఇంకో 2 మెగాపిక్స‌ల్ మాక్రో కెమెరా ఉంది. ముందు వైపు 16 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌కు ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ప‌క్క భాగంలో ఏర్పాటు చేశారు. ఇందులో డాల్బీ అట్మోస్‌, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ వంటి ఫీచ‌ర్లను అందిస్తున్నారు. అలాగే 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉంది. దీనికి ట‌ర్బో చార్జింగ్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు.

మోటో జి32 స్మార్ట్ ఫోన్‌ను సాటిన్ సిల్వ‌ర్‌, మిన‌ర‌ల్ గ్రే క‌ల‌ర్ ఆప్షన్‌ల‌లో రిలీజ్ చేశారు. ఈ ఫోన్ ధ‌ర రూ.12,999 ఉండ‌గా.. దీన్ని ఆగ‌స్టు 16 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్ర‌యించ‌నున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్సాక్ష‌న్ల‌పై రూ.1250 వ‌ర‌కు డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM