moto e40 : మొబైల్స్ తయారీదారు మోటోరోలా ఇ40 పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన మాక్స్ విజన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది.
ఇక ఈ ఫోన్‌లో యూనిసోక్ టి700 ప్రాసెసర్‌ను అమర్చారు. 4జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. వెనుక వైపు 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా.. మరో 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలను ఏర్పాటు చేశారు. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది.
4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లో ఈ ఫోన్ విడుదలైంది. మెమోరీని కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌ను అందిస్తున్నారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను వెనుక వైపు ఏర్పాటు చేశారు. 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు.
మోటో ఇ40 స్మార్ట్ ఫోన్ పింక్ క్లే, కార్బన్ గ్రే కలర్ ఆప్షన్లలో విడుదల కాగా.. ఈ ఫోన్ రూ.9,499 ధరకు అక్టోబర్ 17వ తేదీ నుంచి లభ్యం కానుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…