Siri Hanumanth : తల్లయిన సిరి హనుమంత్.. ఫోటో వైరల్..!

October 1, 2021 10:58 PM

Siri Hanumanth : బిగ్ బాస్ ఫైవ్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంటరైన యూట్యూబ్ సిరి హనుమంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబ్ ఛానల్ ద్వారా పలు వెబ్ సిరీస్ లలో నటించిన ఈమె ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే హౌస్ లోకి వెళ్ళిన సిరి తనదైన శైలిలో ఆడుతూ మరింత పాపులారిటీని సంపాదించుకుంది.

Siri Hanumanth : తల్లయిన సిరి హనుమంత్.. ఫోటో వైరల్..!

ఇప్పటికే హౌస్ లో మొదటి కెప్టెన్ గా ఎన్నికైన సిరి తరుచూ పలు వివాదాలను లేపుతూ గొడవలకు కూడా కారణం అవుతుందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా ఈమెకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యూట్యూబ్‌ స్టార్‌కు నటుడు శ్రీహాన్‌తో ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం జరిగిన వెంటనే ఈ బ్యూటీ బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చింది.

అయితే సిరి ఇదివరకే తల్లి అయిందని ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఇందులో నిజమెంత ఉందనే విషయానికి వస్తే.. సిరి తనకు కాబోయే భర్త శ్రీహాన్ ఇటీవల చైల్డ్ ఆర్టిస్ట్ చైతునూ దత్తత తీసుకుని అతని బాధ్యతలను తీసుకోనున్నట్లు తెలియజేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్లు సిరి తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now