Most Eligible Bachelor : అఖిల్ ఖాతాలో అరుదైన రికార్డ్‌.. రూ.50 కోట్లు సాధించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌..!

November 2, 2021 11:30 PM

Most Eligible Bachelor : అక్కినేని మూడో త‌రం వార‌సుడు అఖిల్ కొన్నేళ్లుగా హిట్ కొసం ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నాడు. 2015లో అఖిల్ సినిమాతో హీరో అయ్యాడు అక్కినేని వారసుడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం దారుణంగా విఫలమైంది. ఆ తర్వాత రెండేళ్లకు హ‌లో సినిమాతో ప‌ల‌క‌రించాడు. అదీ బెడిసి కొట్టింది. ఇక మూడో సినిమా మిస్టర్ మజ్ను పరిస్థితి కూడా అంతే. యావరేజ్ టాక్ వచ్చిన ఈ చిత్రం దారుణంగా నిరాశ పరిచింది.

Most Eligible Bachelor joined in rs 50 crores club

హ్యాట్రిక్ ఫ్లాపుల తర్వాత హిట్ కోసం ఆశ‌గా ఎదురు చూస్తున్న అఖిల్‌.. 15 ఏళ్లుగా హిట్ లేని బొమ్మరిల్లు భాస్కర్‌తో క‌లసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ అనే చిత్రాన్ని చేశాడు. అక్టోబర్ 15న విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే మంచి టాక్ వచ్చింది. తాజాగా ఈ సినిమా రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది. అఖిల్ కెరీర్‌లో మొదటి రూ.50 కోట్ల సినిమా ఇదే కావడం విశేషం.

డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులతోపాటు యువతకు కూడా ఎంతో బాగా నచ్చింది. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే కెమిస్ట్రీకి తోడు గోపీ సుందర్ మ్యూజిక్ సినిమాకు ప్రాణంగా నిలిచింది. గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్, వాసు వర్మ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాన్ని నిర్మించారు.

వినోదంతోపాటు చక్కటి సందేశం కూడా ఈ సినిమాలో ఉందని దర్శక నిర్మాతలు చెప్పిన మాట నూటికి నూరుపాళ్ళు నిజమైంది. గోపీ సుందర్ మ్యూజిక్ సినిమాకు ప్రాణంగా నిలిచింది. ముఖ్యంగా లెహరాయి పాట యూట్యూబ్ లో 25 మిలియన్ వ్యూస్ ను అందుకుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment