Monal Gajjar : మీకు బుద్ధుందా.. ఎందుకు టార్చ‌ర్ పెడుతున్నారు.. అంటూ ఫైర్ అయిన మోనాల్..

November 16, 2021 6:05 PM

Monal Gajjar : బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంది ఫుల్ పాపులారిటీ ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. నాలుగో సీజ‌న్‌లో అయితే తెలియ‌ని వారుగా వ‌చ్చి ఇప్పుడు అందరికీ చాలా ద‌గ్గ‌ర‌య్యారు. వారిలో మోనాల్ గ‌జ్జ‌ర్, అఖిల్ సార్ధ‌క్, అరియానా, మెహబూబ్, సోహైల్ ఉన్నారు.

Monal Gajjar angry on netizen who commented on her

అయితే మోనాల్ మాత్రం ఈ షోతో ఎంత క్రేజ్ సంపాదించుకుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప‌లు సినిమా ఆఫ‌ర్స్, షోస్ ద‌క్కించుకుంది.

బిగ్ బాస్ షో లో మొదట్లో అభిజిత్ తో క్లోజ్ గా ఉంటూ వచ్చిన మోనాల్‌ అదే సమయంలో అఖిల్ తో చనువుగా ఉంది. దీంతో వీళ్ల ముగ్గురు మధ్య లవ్ స్టోరీ నడుస్తున్నట్టు ప్రచారం జరిగింది. అలాంటి పరిస్థితిలో అభిజిత్ ని పూర్తిగా దూరం పెట్టేసి అఖిల్ కి మాత్రం దగ్గరయ్యింది. ఆ క్ర‌మంలో ఆమెపై కాస్త నెగెటివిటీ ఏర్ప‌డింది. ఇప్ప‌టికీ మోనాల్‌ని ఆ విష‌యాల‌పై ట్రోల్ చేస్తూనే ఉన్నారు.

తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్‌ లైవ్‌లోకి రావడంతో.. డ్రామా క్వీన్.. అంటూ బిగ్ బాస్ ఇష్యూని తెరపైకి తెస్తూ ఆమెపై నెటిజన్లు నెగిటివ్ కామెంట్లు పెట్టి విసిగించారు. దీంతో సహనం కోల్పోయిన మోనాల్ గజ్జర్ అసలు.. మీకు బుద్ధి ఉందా ? నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు.. అంటూ కన్నీళ్లు పెట్టుకుని తనని కామెంట్స్ చేసేవాళ్లని ఏకిపారేసింది.

న‌న్ను ఎందుకు టార్చ‌ర్ పెడుతున్నారు. నేను న‌చ్చ‌క పోతే నన్ను అన్ ఫాలో చేయండి.. అంటూ గ‌ట్టిగానే వార్నింగ్ ఇచ్చింది మోనాల్‌. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment