Mohan Lal : సూప‌ర్ స్టార్ మోహన్ లాల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ మూవీ.. నేరుగా ఓటీటీలోనే రిలీజ్‌..!

April 23, 2022 10:03 AM

Mohan Lal : క‌రోనా పుణ్య‌మా అని గ‌త ఏడాదిన్న‌ర కాలం నుంచి ఓటీటీ యాప్‌లు పండుగ చేసుకుంటున్నాయి. అనేక మంది స్టార్స్ ఇప్ప‌టికీ త‌మ సినిమాల‌ను థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసేందుకు వెనుక‌డుగు వేస్తున్నారు. ఇక మ‌ళ‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ సినిమాలు అయితే వ‌రుస‌గా ఓటీటీల్లోనే రిలీజ్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆయ‌న న‌టించిన 12th Man అనే మూవీ కూడా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కానుంది. ఈ మూవీని ఓటీటీలో నేరుగా విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ డీల్ కుదుర్చుకున్నారు. దీంతో ఈ సినిమా ఓటీటీ యాప్‌లోనే సంద‌డి చేయ‌నుంది.

Mohan Lal 12th Man movie releasing on OTT directly
Mohan Lal

12th Man సినిమాకు గాను డిజిట‌ల్ హ‌క్కుల‌ను డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీ ఆ యాప్‌లో నేరుగా రిలీజ్ కానుంది. దీన్ని అతి త్వ‌ర‌లోనే ఈ ప్లాట్ ఫామ్‌పై విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్ప‌టికైతే రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించ‌లేదు. కానీ ఈ వివ‌రాల‌ను.. ఇతర సమాచారాన్ని త్వ‌ర‌లోనే అధికారికంగా వెల్ల‌డించ‌నున్నారు.

ఇక ఈ సినిమాకు జీతు జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మోహ‌న్‌లాల్ ఇందులో లీడ్ రోల్‌లో న‌టించారు. మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ఈ సినిమాను తెర‌కెక్కించారు. దీన్ని ఆంటోని పెరుంబ‌వూర్ నిర్మించ‌గా.. అనిల్ జాన్స‌న్ సంగీతం అందించారు. మ‌ళ‌యాళం భాష‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now