Mohan Babu : మోహన్‌ బాబు సంచలన వ్యాఖ్యలు.. కులం పేరిట తనను దారుణంగా అవమానించారు..

September 28, 2021 5:57 PM

Mohan Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోహన్‌బాబుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అనేక చిత్రాల్లో ఆయన విలన్‌గా, హీరోగా మెప్పించారు. నిర్మాతగా కూడా గుర్తింపు పొందారు. విలక్షణ నటుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కూడా రాణించారు. మొత్తం 500కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన తాజాగా తన జీవితానికి చెందిన పలు విశేషాలను పంచుకున్నారు.

Mohan Babu : మోహన్‌ బాబు సంచలన వ్యాఖ్యలు.. కులం పేరిట తనను దారుణంగా అవమానించారు..
Mohan Babu

ప్రముఖ నటుడు, కమెడియన్‌ ఆలీ పేరిట ఆలీతో సరదాగా అనే కార్యక్రమం ఈటీవీలో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ కార్యక్రమానికి మోహన్‌ బాబు హాజరై ఆలీతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు అనుభవాలను ఆయన ఆలీతో పంచుకున్నారు. తాను సినీ ఇండస్ట్రీలోకి రాక ముందు ఒక స్కూల్‌లో నెలకు కేవలం రూ.140 జీతం మాత్రమే తీసుకుని పనిచేశానని మోహన్‌ బాబు చెప్పారు.

Mohan Babu : మోహన్‌ బాబు సంచలన వ్యాఖ్యలు.. కులం పేరిట తనను దారుణంగా అవమానించారు..
Mohan Babu

ఆ స్కూల్‌లో ఏడాది కాలం పాటు డ్రిల్‌ మాస్టర్‌గా పనిచేశానని, అయితే ఆ సమయంలో తనను కులం పేరిట ఎంతో అవమానించారని అన్నారు. స్కూల్‌ నిర్వాహకులకు చెందిన కులం వాడ్ని కాకపోవడంతో తనను అవమానించేవారని పేర్కొన్నారు. ఈ క్రమంలో తనకు ఎంతో బాధ వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కులం ఎవరికీ చదువుకు అడ్డం కాకూడదనే ఉద్దేశంతోనే తాను విద్యాసంస్థలను ప్రారంభించానని తెలిపారు.

Mohan Babu : మోహన్‌ బాబు సంచలన వ్యాఖ్యలు.. కులం పేరిట తనను దారుణంగా అవమానించారు..
Mohan Babu

ఈ క్రమంలోనే విద్యా నికేతన్‌ పాఠశాలను ప్రారంభించానని, తమ స్కూల్‌లో కులం అనే కాలమ్‌ను తొలగించానని తెలిపారు. మొట్ట మొదటిసారిగా కులం అనే కాలమ్‌ను తొలగించిన వ్యక్తిని తానేనని అన్నారు. ఇలా అప్పట్లో కులం పేరిట తాను ఎన్నో అవమానాల పాలయ్యానని తెలిపారు.

అయితే సినిమాల్లో ఈ స్టైల్‌ ఎలా వచ్చిందని అడగ్గా.. తాను పట్టుబట్టి నేర్చుకున్నానని మోహన్‌ బాబు తెలియజేశారు. అందుకనే ప్రేక్షకులు తనను ఆదరించారని అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now