Mohan Babu : ‘మా’ ఎన్నిక‌ల‌లో భ్ర‌ష్టు రాజ‌కీయాలు.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మోహ‌న్ బాబు..

October 4, 2021 10:21 AM

Mohan Babu : ప్ర‌కాష్ రాజ్‌, మంచు విష్ణులు పోటీ ప‌డుతుండ‌డంతో ‘మా’ ఎన్నిక‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. అక్టోబ‌ర్ 10వ తేదీన పోలింగ్‌.. అదే తేదీన ఫ‌లితాలు విడుద‌ల కానుండ‌డంతో అప్పుడు ఎవ‌రు మా అధ్య‌క్షుడిగా గెలుస్తారా ? అని.. అంద‌రూ ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. అయితే మా ఎన్నిక‌ల నేపథ్యంలో మోహ‌న్ బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Mohan Babu : 'మా' ఎన్నిక‌ల‌లో భ్ర‌ష్టు రాజ‌కీయాలు.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మోహ‌న్ బాబు..

తాజాగా ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి చాన‌ల్‌లో ప్ర‌సారం అయ్యే ఓపెన్ హార్ట్ విత్ ఆర్‌కే లో పాల్గొన్న మోహ‌న్ బాబు మా ఎన్నిక‌ల‌పై షాకింగ్ కామెంట్లు చేశారు. నీచ, నికృష్ణ, దరిద్రగొట్టు, భ్రష్టు రాజకీయాలు మా ఎన్నికలలో నెలకొన్నాయని అన్నారు. తెలిసినవాడు, తెలియనివాడు, వెధవలు, క్యారెక్టర్స్ లేనివాళ్లు కొంతమంది అదేదో కిరీటం అనుకుని, అద్భుతం అనుకుని ఏవేవో మాట్లాడుతున్నార‌ని అన్నారు.

నిజానికి త‌న కుమారుడు మంచు విష్ణును మా ఎన్నికల్లో పోటీ చేయించాలని తాము అనుకోలేదని, అయితే కొన్ని ప్ర‌త్యేక కార‌ణాలు ఉండ‌డం వ‌ల్లే మంచు విష్ణుతో పోటీ చేయించాల్సి వ‌స్తుంద‌న్నారు. ఇక ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం ఎవ‌రికి వారు మాకెందుకులే అన్న ధోర‌ణిలో ఉన్నార‌ని అన్నారు. ఇది స‌రికాద‌న్నారు.

ఇండ‌స్ట్రీలో కొంద‌రు ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నార‌ని మోహ‌న్ బాబు అన్నారు. గ‌జ‌రాజు వెళ్తుంటే కుక్క‌లు మొరుగుతాయ‌ని విమ‌ర్శించారు. ప్ర‌తి దానికీ స‌మాధానం చెప్పాల్సిన ప‌నిలేద‌న్నారు. చిరంజీవి త‌న‌కు ఎప్ప‌టికీ స్నేహితుడేన‌ని, మా ఎన్నిక‌ల్లో మంచు విష్ణు నిల‌బ‌డ‌క‌పోయి ఉంటే ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వెళ్లే వాడిన‌ని అన్నారు. మంచు విష్ణు నామినేష‌న్ వేశాక మెగా ఫ్యామిలీ పిలిచి మాట్లాడి ఉంటే తాము నామినేష‌న్‌ను ఉప‌సంహరించుకునే వాళ్ల‌మ‌ని తెలిపారు. ఇక చిరంజీవి ద‌గ్గ‌రికి వెళ్ల‌క‌పోయినా.. కృష్ణ ఆశీస్సులు తీసుకున్నామ‌న్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now