Mohan Babu : నాకున్న ఆవేశం, తెలివితేటలే నన్ను నడిపించాయి : మోహన్ బాబు

October 16, 2021 10:44 PM

Mohan Babu : మా ఎన్నికలల్లో ప్రమాణ స్వీకారం సమయంలో మంచు మోహన్ బాబు మాట్లాడుతూ.. మా ఎన్నికల వేదిక రాజకీయ వేదిక కాదని.. ఇది కళాకారుల వేదికని అన్నారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో నిర్వహించిన వేదికపై మంచు విష్ణు, ప్యానల్ మెంబర్స్ ప్రమాణ స్వీకారం చేసి తమ బాధ్యతలు స్వీకరించారు. మనమంతా కళామ్మతల్లి బిడ్డలం అనీ, మనుషుల్లో టాలెంట్ ఉంటే అవకాశాలు వస్తాయని.. అందుకే కేవలం టాలెంట్ తోనే ఇక్కడ రాణించగలమని అన్నారు.

Mohan Babu comments in manchu vishnu oath ceremony

 నా జీవితం తెరిచిన పుస్తకం. నా పుస్తకంలో నేను విలన్ గా చేయాలని అనుకున్నాను. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరోగా కూడా చేశాను అని తెలిపారు. అలాగే ఇక్కడ రాజకీయాలు ఉండకూడదని, కేవలం కళాకారులే ఉండాలని అన్నారు. ఈ వేదిక మీద నువ్వు గొప్పా.. నేను గొప్పా అంటూ.. సినిమాలు ఉన్నాయా.. లేవా.. అనేది కాదని ఎంత కష్టపడి సినిమా చేసినా ఒక్కోసారి ఫ్లాప్స్ వస్తూనే ఉంటాయని అన్నారు. అయితే జీవితంలో గెలుపు ఓటమి అనేవి సర్వసాధారణం అని అన్నారు.

సక్సెస్ వచ్చిందని అహానికి పోతే ఆ మరుక్షణమే దేవుడు తిప్పి కొడతాడని అన్నారు. మా ఎన్నికల సమయంలో మేము ఇంతమంది ఉన్నాం.. అంతమంది ఉన్నామని కొంతమంది వ్యక్తులు బెదిరించారు. కానీ మేము ఆ బెదిరింపులకు భయపడలేదని, మా ఓటు మా ఇష్టమని, నా బిడ్డను గెలిపించినందుకు మీకు ఏం ఇచ్చి రుణం తీర్చుకుంటాను. నాకు పగ, రాగద్వేషాలు లేవని.. నా తెలివి తేటలతో, ఆవేశంతో క్రమశిక్షణతోనే ఇక్కడ వరకు వచ్చానని మోహన్ బాబు తెలిపారు.

అలాగే సినీ ఇండస్ట్రీలో పరిశ్రమ పెద్దల్ని గౌరవించాలనే ఉద్దేశ్యంతో తాను ఇక్కడికి వచ్చే ముందు తాను కృష్ణని కూడా కలిశానని అన్నారు. దాదాపు 600 మందికి ఫోన్ చేసినట్లు తెలిపారు. మా సభ్యులకు ఇళ్ళ నిర్మాణం, వారి సమస్యలపై పరిష్కారం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసి మాట్లాడతానని అన్నారు. ఇది మన అసోసియేషన్ అని ఇందుకోసం ప్రతి ఒక్కరి సహకారం కావాలని.. అలాగే మా అధ్యక్ష పదవిని మంచు విష్ణుకు అప్పగించినందుకు తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తాడని అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now