రూ.10వేల కోసం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నారు.. ఈయన గురించి తెలిస్తే కన్నీళ్లు వస్తాయి..

September 21, 2022 2:13 PM

కరోనా వల్ల ఎంతో మంది బతుకులు ఛిద్రమయ్యాయి. ఎంతో మంది ఎన్నో రకాలుగా నష్టపోయారు. చాలా మంది తమ ఆత్మీయులను కోల్పోయారు. కొందరు ఉద్యోగాలను, ఉపాధిని కోల్పోయారు. కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాలను చిన్నా భిన్నం చేసింది. అయితే చాలా మంది ఆర్థికంగా చితికిపోయారు కూడా. అలాంటి వారిలో ఈయన కూడా ఒకరు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

జార్ఖండ్‌లోని హజారిబాగ్‌కు చెందిన మిథిలేష్‌ కుమార్‌ మెహతా 2018లో ఓ కొత్త ట్రాక్టర్‌ కొన్నాడు. అందుకు గాను మహీంద్రా ఫైనాన్స్‌ నుంచి లోన్‌ తీసుకున్నాడు. అంతకు ముందే అతనికి ఉన్న పాత ట్రాక్టర్‌ను ఇచ్చి దానికి వచ్చే మొత్తం పోగా.. ఇంకాస్త మొత్తాన్ని ముందుగా డౌన్‌ పేమెంట్‌ రూపంలో చెల్లించాడు. దీంతో కొత్త ట్రాక్టర్‌ వచ్చింది. మిగిలిన రుణం మొత్తాన్ని 44 వాయిదాల్లో నెలకు రూ.14,300 చొప్పున చెల్లించాల్సి ఉంది. అయితే కరోనా లాక్‌ డౌన్‌ వరకు అంతా సజావుగానే సాగింది. కానీ లాక్‌ డౌన్‌ వల్ల మిథిలేష్‌ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. తీవ్రమైన సమస్యలు చుట్టుముట్టాయి.

mithilesh lost his daughter for loan recovery agents

కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా పనులు జరగక ఆదాయం రాలేదు. అయినప్పటికీ మిథిలేష్‌ ఎలాగో వాయిదాలు చెల్లిస్తూ వచ్చాడు. తనకు తెలిసిన వారి వద్ద డబ్బును అప్పుగా తీసుకుని రుణాన్ని చెల్లించాడు. అయితే చివరకు 6 వాయిదాలు మిగిలాయి. కానీ అతని వద్ద చెల్లించేందుకు చిల్లి గవ్వ లేదు. దీంతో జరిమానా విధించారు. అయినప్పటికీ రూ.33వేల ఫైన్‌తో మొత్తం రూ.1.22 లక్షలను ఈ ఏడాది సెప్టెంబర్‌ 22 వరకు చెల్లించాలని గడువు పెట్టడంతో.. ఆ మొత్తాన్ని అతను తీర్చేశాడు.

అయితే సెప్టెంబర్‌ 15వ తేదీన ఉన్నట్లుండి ఆ ఫైనాన్స్‌ కంపెనీకి చెందిన రికవరీ ఏజెంట్లు మిథిలేష్‌ ఇంటికి వచ్చారు. రుణం ఇంకా రూ.10వేలు ఉందని అది చెల్లించాలని లేదంటే ట్రాక్టర్‌ను తీసుకెళ్తామని చెప్పారు. అయితే మిథిలేష్‌ కుమార్తె మోనిక (22) అక్కడే ఉండి లోన్‌ మొత్తం చెల్లించామని.. ఒక్క రూపాయి కూడా పెండింగ్‌ లేదని చెప్పింది. కానీ ఆ ఏజెంట్లు కొన్ని పేపర్లు చూపించి ఇంకా రూ.10వేలు రావల్సి ఉందని అన్నారు. అయితే తమ వద్ద డబ్బు లేదని చెప్పగా.. ఆ ఏజెంట్లు ఆ ట్రాక్టర్‌ను తీసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో మిథిలేష్‌, మోనిక ఇద్దరూ ట్రాక్టర్‌కు అడ్డు పడ్డారు. అయితే కనికరం లేని ఏజెంట్లు మోనిక మీదుగా ట్రాక్టర్‌ను రెండు సార్లు పోనిచ్చారు. గర్భంతో ఉన్న ఆమెకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ క్రమంలోనే సదరు ఏజెంట్లపై కేసు నమోదు చేశారు.

అయితే కేవలం రూ.10వేల కోసం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నారని మిథిలేష్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే అతను పడుతున్న బాధ వర్ణనాతీతం. అయితే మరోవైపు మహీంద్రా ఫైనాన్స్‌ సంస్థ స్పందించి మిథిలేష్‌కు సారీ చెప్పింది. అయినప్పటికీ రికవరీ ఏజెంట్లు చేసింది మాత్రం క్షమించరాని నేరం అని అందరూ అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment