Minister KTR : షాకింగ్‌.. మంత్రి కేటీఆర్‌ కనిపించడం లేదంటూ వాల్‌ పోస్టర్లు..

September 29, 2021 3:44 PM

Minister KTR : వర్షాకాలం వచ్చిందంటే చాలు.. అనేక నగరాలు, పట్టణాలు జలమయం అవుతుంటాయి. చిన్న వర్షం పడితేనే రహదారులు చెరువుల్లా మారుతుంటాయి. ఇక భారీ వర్షాలకు అయితే జనజీవనం అస్తవ్యస్తంగా మారుతుంది. తాజాగా గులాబ్‌ తుఫాన్‌ కారణంగా కురుస్తున్న వర్షాలకు ఏపీ, తెలంగాణలలో అనేక ప్రాంతాల్లో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Minister KTR : షాకింగ్‌.. మంత్రి కేటీఆర్‌ కనిపించడం లేదంటూ వాల్‌ పోస్టర్లు..
Minister KTR

అయితే హైదరాబాద్‌ నగరంలో కురిసిన వర్షాల వల్ల అనేక కాలనీలు, బస్తీలు ఇప్పటికే జలమయం అయ్యాయి. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే నగరంలోని ఓ కాలనీలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ కనిపించడం లేదంటూ కొన్ని పోస్టర్లు వెలిశాయి. అవి చర్చనీయాంశంగా మారాయి.

హైదరాబాద్‌ నగరంలో ఓ చోట గోడలకు మంత్రి కేటీఆర్‌ వాల్‌ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ఆయన కనిపించడం లేదంటూ ఆ పోస్టర్లలో ముద్రించారు. అయితే నగరంలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల అనేక చోట్ల కాలనీలు, బస్తీలు జలమయం అయ్యాయి. జీహెచ్‌ఎంసీ ప్రత్యేక మాన్‌సూన్‌ బృందాలను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ చాలా చోట్ల సమస్యలు ఉండడంతో వారికి అన్ని సమస్యలను ఒకేసారి పరిష్కరించడం కష్టంగా మారింది. దీంతో సిబ్బంది సంఖ్యను పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now