Micromax IN Note 2 : మొబైల్స్ తయారీదారు మైక్రోమ్యాక్స్.. ఇన్ నోట్ 2 (IN Note 2) పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇన్ నోట్ 1కు కొనసాగింపుగా ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఇందులో 6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ముందు వైపు 16 మెగాపిక్సల్ పంచ్ హోల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జి95 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 4జీబీ ర్యామ్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. దీనికి ఆండ్రాయిడ్ 12 అప్‌డేట్‌ను కూడా అందిస్తామని కంపెనీ తెలియజేసింది.
ఈ ఫోన్ వెనుక వైపు ప్లాస్టిక్ ఫినిషింగ్ ఉంది. కానీ గ్లాస్ మాదిరిగా కనిపిస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను పక్క వైపున ఇచ్చారు. వెనుక వైపు 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా.. మరో 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సల్ మాక్రో సెన్సార్‌లను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని అమర్చారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తోంది. దీని వల్ల కేవలం 25 నిమిషాల్లోనే ఫోన్ చార్జింగ్ 50 శాతం వరకు పూర్తవుతుంది.
మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 స్మార్ట్ ఫోన్ బ్లాక్, ఓక్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్ ధర రూ.13,490 ఉండగా.. లాంచింగ్ ఆఫర్ కింద ఈ నెల 30వ తేదీ వరకు రూ.12,490కే విక్రయించనున్నారు. ఫ్లిప్ కార్ట్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…