Mi Sale : షియోమీ ఎంఐ దీపావ‌ళి సేల్ ప్రారంభం.. భారీ డిస్కౌంట్ల‌కు స్మార్ట్ ఫోన్లు..!

October 3, 2021 9:42 AM

Mi Sale : మొబైల్స్ త‌యారీ సంస్థ షియోమీ ఆదివారం (అక్టోబ‌ర్ 3, 2021) దీవాలి విత్ ఎంఐ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ ఈ నెల 7వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌కు షియోమీ ఫోన్లు, ఇత‌ర ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Mi Sale : షియోమీ ఎంఐ దీపావ‌ళి సేల్ ప్రారంభం.. భారీ డిస్కౌంట్ల‌కు స్మార్ట్ ఫోన్లు..!

ఈ సేల్‌లో భాగంగా షియోమీ.. ఎస్‌బీఐ తో భాగ‌స్వామ్యం అయింది. దీంతో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులు ఉన్న‌వారికి షియోమీ ఉత్ప‌త్తుల కొనుగోలుపై అద‌నంగా మ‌రో 10 శాతం డిస్కౌంట్ ల‌భిస్తుంది. ఇక ఈజీ ఈఎంఐ స‌దుపాయాన్ని కూడా అందిస్తున్నారు.

సేల్‌లో భాగంగా స్పిన్ ది వీల్ పోటీని నిర్వ‌హిస్తున్నారు. ఇందులో వీల్‌ను తిప్పి రూ.1 కోటి వ‌ర‌కు గెలుచుకునే అవ‌కాశాన్ని అందిస్తున్నారు. ఈ సేల్‌లో రెడ్‌మీ 10 ప్రైమ్ ఫోన్‌పై రూ.1700 డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అలాగే రెడ్‌మీ నోట్ 10ఎస్‌పై రూ.1750, నోట్ 10 ప్రొ ఫోన్‌పై రూ.2750, నోట్ 10 ప్రొ మ్యాక్స్ పై రూ.2250 వ‌ర‌కు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అలాగే ప‌లు ఇత‌ర ఫోన్ల‌పై కూడా ఇదే విధంగా డిస్కౌంట్ల‌ను పొంద‌వ‌చ్చు.

ఈ సేల్‌లో ఎంఐ టీవీలు, స్మార్ట్ బ్యాండ్‌ల‌ను కూడా త‌గ్గింపు ధ‌ర‌ల‌కే అందిస్తున్నారు. ప్ర‌తి రోజూ సేల్‌లో భాగంగా ప్ర‌త్యేక‌మైన డీల్స్ ను కూడా అందిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now