Hari Hara Veera Mallu : అది మ‌రో ఆచార్య అవుతుంద‌ని ఆందోళ‌న చెందుతున్న మెగా ఫ్యాన్స్‌..!

June 22, 2022 2:44 PM

Hari Hara Veera Mallu : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తుతం షూటింగ్‌ల‌కు విరామం ఇచ్చి రాజ‌కీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఇటీవ‌లే త‌న బ‌స్సు యాత్ర కోసం ప‌లు వాహ‌నాల‌ను కూడా కొనుగోలు చేశారు. అక్టోబ‌ర్ 5 నుంచి షూటింగ్‌ల‌కు బ్రేక్ ఇచ్చి 6 నెల‌ల పాటు ఆయ‌న బ‌స్సు యాత్ర చేస్తార‌ని తెలుస్తోంది. ఇక అప్ప‌టి వ‌ర‌కు సినిమాలు చేసేందుకు కాల్ షీట్స్ ఇచ్చార‌ట‌. అయితే ఆ గ్యాప్‌లో ఆయ‌న వినోద‌య సీతం సినిమాను పూర్తి చేస్తారని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ప్రాజెక్ట్ ఇక అట‌కెక్కేసిన‌ట్లేన‌ని అంటున్నారు.

వాస్త‌వానికి హ‌రిహ‌ర వీర‌మ‌ల్లును ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ కోవిడ్ వ‌ల్ల ఆల‌స్యం అయింది. దీంతో ఎట్ట‌కేల‌కు ఈ మూవీ షూటింగ్ భీమ్లా నాయ‌క్ రిలీజ్ అనంత‌రం ప్రారంభం అయింది. కానీ ఈ మూవీ షూటింగ్ మ‌ళ్లీ ఆగిన‌ట్లు తెలుస్తోంది. ప‌వ‌న్ సూచించిన విధంగా ద‌ర్శ‌కుడు క్రిష్ మార్పులు చేయ‌లేద‌ని.. క‌నుక ఆ మార్పులు జ‌రిగే వ‌ర‌కు షూటింగ్‌ను ప‌వ‌న్ ఆపార‌ని తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. అయితే అన్నీ బాగున్నాయ‌నుకుంటే ఈ మూవీకి మ‌రో ఆటంకం క‌లిగింది. ప‌వ‌న్ పొలిటిక‌ల్ టూర్ నేప‌థ్యంలో ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల పాటు వాయిదా ప‌డే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అదే జ‌రిగితే ఈ మూవీ మ‌రో ఆచార్య అవుతుంద‌ని మెగా ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నారు.

mega fans worry about Hari Hara Veera Mallu
Hari Hara Veera Mallu

అప్ప‌ట్లో ఆచార్య మూవీకి కూడా ఇలాగే జ‌రిగింది. సినిమాను అనౌన్స్ చేశాక కోవిడ్ వ‌ల్ల ఆల‌స్యం కాగా.. త‌రువాత ప‌లు కార‌ణాల వ‌ల్ల సినిమా విడుద‌ల ఆగింది. త‌రువాత ఎట్ట‌కేల‌కు సినిమాను రిలీజ్ చేసినా.. దానిపై ప్రేక్ష‌కులకు ఆస‌క్తి త‌గ్గింది. దీంతోపాటు సినిమాకు చివ‌రి నిమిషంలో అనేక మార్పులు చేశారు. వెర‌సి.. ఆచార్య ఫ‌లితం దారుణంగా వ‌చ్చింది. ఈ మూవీని మెగా ఫ్యాన్స్ త‌మ మెమొరీలోంచి తీసేయాల‌ని చూస్తున్నారు. కానీ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు కూడా ఆచార్య‌ను త‌ల‌పిస్తుంద‌ని అంటున్నారు. ఈ మూవీ కూడా ఆచార్య లాగే ఆల‌స్యం అయితే అప్పుడు ఫ‌లితం కూడా ఆచార్య లాగే వ‌స్తుంద‌ని.. దీంతో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు మ‌రో ఆచార్య అవుతుంద‌ని మెగా ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నారు. అయితే హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు షూటింగ్ ఆచార్య లాగే ఆల‌స్యం అవుతుందా.. లేక వేగంగా పూర్తి చేస్తారా.. అన్న వివ‌రాలు వేచి చూస్తే తెలుస్తాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now