Allu Arjun : పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ అమాంతం పెరిపోయింది. దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే బన్నీ మొదటి నుంచే మెగా హీరోల్లో తన శైలి వేరు అన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఆయన తీరు కూడా ఎప్పటికప్పుడు వివాదాస్పదంగా ఉంటుంది. మరో వైపు ఆయన మెగా కాంపౌండ్ హీరో అనిపించుకునేందుకు ఆసక్తి చూపరు అంటూ కొందరి అభిప్రాయం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఎప్పటికప్పుడు కోల్డ్ వార్ నడుపుతూ ఉండే అల్లు అర్జున్ ఈసారి మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేసిన వారికి మద్దతుగా నిలిచి దుమారం రేపిన విషయం తెల్సిందే.
బింబిసార సినిమా విడుదల సమయంలో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. కళ్యాణ్ రామ్ అభిమానులు ఆయన్ని మెగాస్టార్ అంటూ సంబోధిస్తూ ఉన్న సమయంలో అల్లు అర్జున్ వెళ్లి కళ్యాణ్ రామ్ కి మద్దతు తెలపడం.. బింబిసార సినిమాకు ప్రశంసలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇదెక్కడి విడ్డూరం అంటూ అల్లు అర్జున్ ను మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. తాజాగా మరోసారి అల్లు అర్జున్ పై విమర్శల వర్షం కురిపిస్తూ కొందరు అల్లు అర్జున్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మెగా కాంపౌండ్ హీరోలు అంతా ఒక్క మాటపై ఉండకుండా అయ్యిందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా మొన్న అల్లు రామలింగయ్య ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మా పునాది అని రాసుకొచ్చారు. దీన్ని బట్టి బన్నీ అల్లు ఫ్యామిలీకి చెందిన వాడే కానీ మెగా ఫ్యామిలీ కాదు అని చెప్పకనే చెప్పాడు. అలాగే అనేక వేదికలపై పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ అభిమానులు అరుస్తూ ఉంటే అల్లు అర్జున్ ఇబ్బందిపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. వీటికి తోడు అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ ని ప్రేమగా నా ఆర్మీ అంటూ సంభోధిస్తాడు కానీ మెగా ఫ్యాన్స్ ను వేరుగా చూస్తాడు.
దీంతో అల్లు అర్జున్ తీరును మరోసారి ట్విట్టర్ ద్వారా మెగా అభిమానులు తప్పుబడుతున్నారు. బన్నీ ఇలాగే వ్యవహరిస్తే ఆయన పుష్ప 2 సినిమాను బ్యాన్ చేయాల్సి ఉంటుందని అభిమానులు హెచ్చరించారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులకు, మెగా ఫ్యాన్స్ కి మధ్య వైరం ముదురుతోంది. ఇది కనుక పెరిగితే మెగా కాంపౌండ్ సినిమాల విడుదల సమయంలో రచ్చ జరగడం ఖాయం అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…