Prabhudeva : ప్రభుదేవాపై మెగా ఫ్యాన్స్‌ తీవ్ర ఆగ్రహం.. కారణం అదే..!

September 22, 2022 9:07 AM

Prabhudeva : మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం గాడ్‌ ఫాదర్‌.. అక్టోబర్‌ 5వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్‌ అయ్యేందుకు సిద్ధమవుతోంది. మళయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ నటించిన లూసిఫర్‌ చిత్రానికి రీమేక్‌గా గాడ్‌ ఫాదర్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార, సత్యదేవ్‌ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. దీనికి మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీ నుంచి లేటెస్ట్‌గా తార్‌మార్‌ తక్కర్‌ మార్‌ అనే సాంగ్‌ రిలీజ్‌ అయింది. మేకర్స్‌ ఈ సాంగ్‌కు చెందిన లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. అయితే ఈ పాటపై ఫ్యాన్స్‌ మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ పాటను థమన్‌ కంపోజ్‌ చేయగా.. శ్రేయా ఘోషల్‌ పాడారు. అలాగే ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు. అయితే అంతా బాగానే ఉంది కానీ థమన్‌, ప్రభుదేవాలపైనే ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటకు మ్యూజిక్‌ అంత బాగా ఏమీ లేదని.. నాసిరకంగా ఉందని.. రొటీన్‌ పాటలాగా మ్యూజిక్‌ ఉందని అంటున్నారు. అలాగే అంతటి సీనియర్‌ అయి ఉండి కూడా ప్రభుదేవా చెత్త స్టెప్స్‌ వేయించారని.. అదే శేఖర్‌ మాస్టర్ అయితే డ్యాన్స్‌ ఇంకా బాగుండేదని కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌, ఇటు కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవాలపై ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు.

mega fans angry on Prabhudeva for his dance steps
Prabhudeva

ఇక గాఢ్‌ ఫాదర్‌ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌లపై రామ్‌ చరణ్‌, ఆర్బీ చౌదరి, ప్రసాద్‌ ఎన్‌వీలు నిర్మిస్తున్నారు. దీనికి నీరవ్‌ నరేష్‌ సినిమాటోగ్రఫీ బాధ్యతలు వహించగా.. ఈ మూవీలో ఇంకా మురళీ శర్మ, సునీల్‌, బ్రహ్మాజీ, సముద్రఖని తదితర నటీనటులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now