Mega Daughters : వివాదాల‌లో మెగా త‌న‌యలు.. ఇది శాప‌మా ?

Mega Daughters : స్వ‌యంకృషితో ఉన్నత స్థాయికి చేరుకున్న చిరంజీవి మెగాస్టార్‌గా అభిమానుల మ‌న‌సుల‌లో చెర‌గని ముద్ర వేసుకున్నారు. ఆయ‌న వేసిన బాట‌లో మెగా హీరోలు న‌డుస్తూ మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకుంటున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయితేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ మెగా ఫ్యామిలీ ద్వారా వచ్చిన గుర్తింపు వల్ల ఇండస్ట్రీలో హీరోలుగా నిలదొక్కుకున్నారు. అయితే వీరు ఎలాంటి వివాదాల జోలికి వెళ్ల‌కుండా స్లో అండ్ స్ట‌డీగా త‌మ కెరీర్ కొన‌సాగిస్తూ వ‌స్తున్నారు. కానీ మెగా డాట‌ర్స్ మాత్రం ప‌లు విష‌యాల‌తో హాట్ టాపిక్ అవుతున్నారు.

Mega Daughters

చిరంజీవి పెద్ద కూతురు సుస్మితకు ఉదయ్ కిరణ్ తో పెళ్లి చేయాలని మెగాస్టార్ చిరంజీవి భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ వివాహం జరగలేదు. ఎంగేజ్‌మెంట్ వ‌ర‌కు వెళ్లి క్యాన్సిల్ కావ‌డంతో ఈ విష‌యం అప్ప‌ట్లో బాగా చ‌ర్చ‌నీయాంశం అయింది. ఇక శ్రీజ కుటుంబ సభ్యులకు చెప్పకుండా తాను ప్రేమించిన శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంది. అయితే వివాహం అనంతరం భర్తతో విభేదాలు రావడంతో శ్రీజ విడాకులు తీసుకుంది. శ్రీజ పెళ్లి స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌న్ చేత ప‌ట్టుకోవ‌డం వ‌ర‌కు వెళ్లింది. ఇక శిరీష్‌తో ప‌లు ఇష్యూస్ వ‌ల‌న విడిపోయిన శ్రీజ‌.. కళ్యాణ్ దేవ్ ని వివాహం చేసుకుంది.

శ్రీజ, కళ్యాణ్ దేవ్ కూడా విడిపోయారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయనే సంగతి తెలిసిందే. ఇక‌ నాగబాబు కూతురు నిహారిక కొన్నాళ్లపాటు వివాదాల‌కు దూరంగా ఉంది. తాజాగా ఈమె డ్ర‌గ్స్ కేసులో ఇరుక్కోవ‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి నిహారికపై ప‌డింది. భ‌ర్త లేకుండా ఉగాది రోజు నిహారిక ప‌బ్‌కి వెళ్ల‌డం ప్ర‌తి ఒక్క‌రినీ ఆశ్చ‌ర్యంలోకి నెట్టింది. కొంద‌రు నిహారిక‌తోపాటు మెగా ఫ్యామిలీపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇలా మెగా ఫ్యామిలీ ఆడ‌పడుచులు వివాదాల్లో చిక్కుకోవ‌డం.. వారి ఫ్యామిలీకి శాప‌మా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM

2024 vs 2026.. ఏ వరల్డ్ కప్ విజయం గొప్పది? ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ!

భార‌త టీ20ఐ క్రికెట్ జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ…

Saturday, 14 March 2026, 8:31 PM

గ్యాస్, పెట్రోల్ కొరత రాదు.. కేంద్రం కీలక ప్రకటన! ఆ జలసంధి వద్ద టెన్షన్..

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…

Saturday, 14 March 2026, 7:22 PM

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM

‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ డేట్ ఖరారు.. రష్మిక-షాహిద్-కృతి ఫస్ట్ లుక్ చూశారా?

ర‌ష్మిక మంద‌న్న‌, షాహిద్ కపూర్‌, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…

Saturday, 14 March 2026, 11:53 AM

వివాదాస్పద రనౌట్.. బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లో హైడ్రామా! ‘క్రికెట్ స్ఫూర్తి’ ఎక్కడ?

పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…

Friday, 13 March 2026, 8:27 PM

సినిమాలకు సెన్సార్ బోర్డు కొత్త రూల్.. ఇక సబ్‌టైటిల్స్ తప్పనిసరి! మార్చి 15 నుంచి అమల్లోకి..

సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…

Friday, 13 March 2026, 5:41 PM

‘పిల్లలకు ఊపిరాడటం లేదు’.. ముంబై కాలుష్యంపై దీపికా పదుకొనె ఆందోళన! అధికారులకు ప్రశ్న.

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…

Friday, 13 March 2026, 11:45 AM