Meena : భ‌ర్త చ‌నిపోయాక మీనా సంచ‌ల‌న నిర్ణ‌యం..?

July 1, 2022 1:28 PM

Meena : తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌టి మీనా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె సౌత్‌కు చెందిన ఎన్నో చిత్రాల్లో న‌టించి న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతోపాటు త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళం భాష‌ల‌కు చెందిన చిత్రాల్లో ఈమె న‌టించి తానేంటో నిరూపించుకుంది. ఒక‌ప్పుడు టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మీనా నంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా ఉండేది. చిరంజీవి, నాగార్జున‌, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్ వంటి అగ్ర హీరోలు అంద‌రితోనూ ఈమె సినిమాలు చేసింది. ముఖ్యంగా ఈమె వెంక‌టేష్‌తో క‌ల‌సి చేసిన సినిమాలు హిట్ అయ్యాయి. అలాగే శ్రీ‌కాంత్ వంటి సీనియ‌ర్ న‌టుల‌తోనూ ఈమె యాక్ట్ చేసింది.

అయితే మీనా కెరీర్‌లో చాలా లేట్‌గా వివాహం చేసుకుంది. సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్న విద్యాసాగ‌ర్‌ను పెళ్లాడింది. దీంతో కొంత కాలం పాటు ఈమె సినిమాల‌కు దూరంగా ఉంది. త‌రువాత కుమార్తె నైనిక జ‌న్మించింది. అనంత‌రం ఈమె కాస్త గ్యాప్ తీసుకుని మ‌ళ్లీ సినిమాలు చేసింది. ఇప్ప‌టికీ ఈమె సినిమాల్లో న‌టిస్తూనే ఉంది. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ ఈమె అద‌ర‌గొడుతోంది. ఈమె న‌టించిన దృశ్యంతోపాటు ప‌లు ఇత‌ర మ‌ళ‌యాళ చిత్రాలు కూడా హిట్ అయ్యాయి. ఇలా రెండో ఇన్నింగ్స్‌లోనూ మీనా కెరీర్ పీక్స్‌లోనే ఉంది. అయితే ఇంత‌లోనే ఆమె జీవితంలో ఓ అపశృతి చోటు చేసుకుంది. ఆమె భ‌ర్త ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్ష‌న్ కార‌ణంగా చ‌నిపోయారు. దీంతో మీనా కుటుంబంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

Meena took important decision after her husband death
Meena

అయితే భ‌ర్త చ‌నిపోయిన అనంత‌రం మీనా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె కుమార్తెను త‌న భ‌ర్తే చూసుకునేవారు. అయితే ఇప్పుడు ఆయ‌న లేరు. క‌నుక కుమార్తె భారం మొత్తం ఇప్పుడు మీనాపైనే ప‌డింది. దీంతో ఆమె ఇక‌పై సినిమాలు చేయొద్ద‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇక సినిమాలు చేయ‌కుండా పూర్తిగా కుమార్తె బాధ్య‌త‌ల‌నే ఆమె చూసుకోనున్న‌ట్లు స‌మాచారం. అయితే ఇప్ప‌టికే ఆమె ప‌లు సినిమాల్లో న‌టిస్తోంది క‌నుక ఎలాగోలా వాటిని పూర్తి చేసి.. ఇక సినిమా ఇండ‌స్ట్రీకి ఆమె గుడ్ బై చెబుతుంద‌ని తెలుస్తోంది. అయితే ఇవ‌న్నీ సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్తలే. ఇందులో నిజం ఎంత ఉంది.. అనే విష‌యం తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now