Meena : పెళ్లి రోజు భ‌ర్త గురించి మ‌ళ్లీ పోస్టు పెట్టిన మీనా.. వైర‌ల్ అవుతున్న మెసేజ్‌..!

July 15, 2022 8:23 AM

Meena : సీనియ‌ర్ హీరోయిన్ మీనా ఇటీవ‌లే త‌న భ‌ర్త‌ను కోల్పోయిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే ఆమెను ఒక్క‌సారిగా వివాదాలు చుట్టు ముట్టాయి. అలాగే భ‌ర్త‌తో క‌ల‌సి ఉన్న మ‌ధుర క్ష‌ణాల‌ను ఆమె గుర్తు చేసుకుంటూ క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తోంది. తాజాగా మీనా త‌న భ‌ర్త గురించి మ‌ళ్లీ పోస్టు పెట్టింది. పెళ్లి రోజున ఆయ‌న‌ను త‌ల‌చుకుంటూ ఆమె పెట్టిన పోస్టు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

భ‌ర్త‌ను ఈ మ‌ధ్యే కోల్పోయిన మీనా తీవ్ర‌మైన దుఃఖంలో ఉంది. ఆమె భ‌ర్త విద్యాసాగర్ క‌రోనా బారిన ప‌డి కోలుకున్నారు. కానీ ఊపిరితిత్తుల‌కు ఇన్ఫెక్ష‌న్ ఎక్కువైంది. దీంతో ఆయ‌న ఐసీయూలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. ఈ క్ర‌మంలోనే విద్యాసాగ‌ర్ జూన్ 29న చ‌నిపోయారు. అప్ప‌టి నుంచి మీనాపై అనేక రూమ‌ర్స్ వినిపిస్తున్నాయి. మీనా వ‌ల్లే ఆమె భ‌ర్త చ‌నిపోయాడ‌ని.. కాదు వారి ఇంటి ద‌గ్గ‌ర ఉన్న పావురాల వ‌ల్ల చ‌నిపోయాడ‌ని.. ఇలా ర‌క‌ర‌కాల వార్త‌లు ప్ర‌చారం అయ్యాయి.

Meena put a post about her husband Vidya Sagar on her marriage day
Meena

అయితే ఆ వార్త‌ల‌పై స్పందించిన మీనా ఈ స‌మ‌యంలో త‌న‌ను ఇలా త‌ప్పుడు వార్త‌ల‌తో ఇబ్బంది పెట్టొద్ద‌ని కోరారు. త‌న‌కు ప్రైవ‌సీ క‌ల్పించాల‌ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇక ఆ త‌రువాత కూడా ఆమెపై రూమ‌ర్స్ ఆగలేదు. మీనా భ‌ర్త‌కు రూ.250 కోట్ల ఆస్తి ఉంద‌ని.. దాన్ని మీనాకు కాకుండా త‌న కుమార్తె నైనిక పేరిట రాశార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే వీటిపై మీనా స్పందించ‌లేదు. కానీ తాజాగా ఆమె త‌మ పెళ్లి రోజు సంద‌ర్భంగా మ‌ళ్లీ పోస్ట్ పెట్టింది. భ‌ర్త‌ను త‌ల‌చుకుంటూ ఎమోష‌న‌ల్ అయింది.

నువ్వు ఒక అంద‌మైన దేవుడిచ్చిన దీవెనవి. కానీ ఆ దేవుడు నిన్ను చాలా త్వ‌ర‌గా నా నుంచి తీసుకెళ్లాడు. నువ్వు ఎప్ప‌టికీ నా గుండెల్లో ఉంటావు. మ‌న ఫ్యామిలీ, నేను, ప్ర‌పంచం న‌లుమూల‌ల నుంచి ప్రేమ‌ను, ప్రార్థ‌నల‌ను పంపిస్తున్నా.. మిలియ‌న్ హార్ట్స్‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను.. ఈ విపత్కర పరిస్థితుల్లో మాపై.. స్నేహితులు, ఫ్యామిలీ ఎవ‌రు అయితే శ్రద్థ, ప్రేమ‌ను చూపిస్తూ.. స‌పోర్ట్ చేస్తున్నారో.. మీరు మా జీవితంలో ఉన్నందుకు గొప్ప‌గా ఫీల్ అవుతున్నాను. మీ ప్రేమ‌ను నేను గ్రేట్ ఫుల్‌గా ఫీల్ అవుతున్నాను.. అంటూ మీనా పోస్ట్ పెట్టింది. కాగా ఈమె పోస్ట్ సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. మీనా త‌న భ‌ర్త‌ను ఎంత‌గా మిస్ అవుతుందో క‌దా.. అని నెటిజ‌న్లు సైతం విచారిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now