SS Thaman : టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేష‌న్ థ‌మన్ బ‌ర్త్ డే..శుభాకాంక్ష‌ల వెల్లువ‌

November 16, 2021 2:27 PM

SS Thaman : టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ‏లో ఎస్ఎస్ థమన్ ఒకరు. అతనిపై ఎన్ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయో, అంతకన్నా ఎక్కువ‌గా పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందుతున్నాడు. వరుస బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ తో దూసుకుపోతున్నాడు. గత రెండేళ్లుగా మంచి హిట్స్ తో దూసుకెళుతున్న థ‌మ‌న్ ప్ర‌స్తుతం డజనుకు పైగా సినిమాలతో బిజీగా ఉన్నారు. నేడు (నవంబర్ 16) థమన్ పుట్టినరోజు సందర్భంగా ఆయ‌న‌కు ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

many fans wishing SS Thaman happy birth day trending in social media

మ‌హేష్ బాబు త‌న సోష‌ల్ మీడియా ద్వారా థ‌మ‌న్‌తో దిగిన ఫొటోని షేర్ చేస్తూ బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాడు. గ‌నిటీం, ఎన్‌బీకే 107 టీం, ఎస్ఎస్ఎమ్‌బీ 28 చిత్రాల‌తోపాటు ప‌లువురు ప్ర‌ముఖులు అత‌నికి బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

అయితే థ‌మ‌న్ బ‌ర్త్ డే సందర్భంగా ఆయ‌న బ‌ర్త్ డే హ్యాష్ ట్యాగ్ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ మ‌ధ్య కాలంలో స్టార్ హీరోల‌కు అద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చి సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డ‌మే ఇందుకు కార‌ణం అని చెప్ప‌వ‌చ్చు.

తాజాగా ఓ న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన థ‌మ‌న్.. తన కెరీర్ లో ఒప్పుకున్న తర్వాత తన చేతి నుంచి వెళ్లిపోయిన సినిమా ‘టక్ జగదీష్’ అని థమన్ అన్నారు. ”ఆ సినిమాకి నేను చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ నాని గారికి నచ్చలేదు. మళ్ళీ వేరే మ్యూజిక్ డైరెక్టర్ తో చేయించుకున్నారు. దానికి కొంచెం బాధ పడ్డాను. ఇలా నా లైఫ్ లో ఫస్ట్ టైం జరిగింది. ఎక్కడ తప్పు జరిగిందో నాకు తెలియదు” అని థమన్ చెప్పారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now