Manchu Vishnu : ‘మా’ రారాజు మంచు విష్ణు.. ఆయ‌న విజ‌యానికి ప్ర‌ధాన కార‌ణాలు ఇవే..?

October 10, 2021 10:35 PM

Manchu Vishnu : గ‌త కొద్ది రోజులుగా ఎంతో ఉత్కంఠ‌గా సాగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల ప్ర‌చారానికి శనివారంతో తెర ప‌డింది. ఆదివారం ఉత్కంఠ‌గా పోలింగ్ సాగింది. చిన్న చిన్న ఉద్రిక్త సంఘ‌ట‌న‌లు మిన‌హా పోలింగ్ ప్ర‌శాంతంగానే ముగిసింది. అయితే ఓటు వేయాల్సిన స‌భ్యులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోవ‌డంతో పోలింగ్ స‌మ‌యాన్ని గంట పాటు పెంచారు. ఈ క్ర‌మంలోనే గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా పోలింగ్ జ‌రిగింది. చివ‌ర‌కు ఎన్నిక‌ల ఫ‌లితాల్లో మంచు విష్ణుకే అధ్య‌క్ష పీఠం ద‌క్కింది.

Manchu Vishnu won in maa elections these are the reasons for his victory

అయితే ముందు నుంచీ చాలా మంది ప్ర‌కాష్ రాజ్ గెలుస్తార‌ని బ‌లంగా న‌మ్ముతూ వ‌చ్చారు. కానీ చివ‌ర‌కు మంచు విష్ణు గెల‌వ‌డంతో ఒక్క‌సారిగా అందరూ షాక్ కు గుర‌య్యారు. ఇక మంచు విష్ణు విజ‌యం వెనుక ఉన్న కార‌ణాల‌ను ఒక్క‌సారి ప‌రిశీలిస్తే..

మంచు విష్ణు మొద‌ట్నుంచీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో విస్తృతంగా పాల్గొన్నారు. మా లో ఉన్న ప్ర‌తి స‌భ్యుడిని క‌లిసి వారి స‌మ‌స్య‌ల‌ను విని వాటిని ప‌రిష్క‌రిస్తామ‌ని హామీలు ఇస్తూ ముందుకు సాగారు. ఎన్నిక‌ల‌లో మంచు విష్ణు గెలిచేందుకు ఇది కూడా స‌హాయ ప‌డింది.

Manchu Vishnu won in maa elections these are the reasons for his victory

ఇక ఇండ‌స్ట్రీ పెద్ద‌ల ఆశీస్సులు తీసుకోవ‌డంలోనూ విష్ణు.. ప్ర‌కాష్ రాజ్ క‌న్నా ముందే ఉన్నారు. కృష్ణం రాజు, కృష్ణ‌, కోట శ్రీ‌నివాస రావు, బాల‌కృష్ణ వంటి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ప్ర‌కాష్ రాజ్ మాత్రం ఇండ‌స్ట్రీ పెద్ద‌ల గురించి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఇది ఆయ‌న‌కు మైన‌స్ అయిన‌ట్లు చెప్ప‌వ‌చ్చు.

ఇక మంచు విష్ణు విజ‌యం వెనుక ఉన్న మ‌రో కార‌ణం.. మోహ‌న్ బాబు, న‌రేష్ అని చెప్పాలి. ఈ ఇద్ద‌రూ ముందు నుంచీ అన్ని వ్య‌వ‌హారాల్లోనూ చురుగ్గా వ్య‌వ‌హ‌రించారు. మా స‌భ్యుల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డంలో వీరిద్ద‌రూ చ‌క్రం తిప్పారు. క‌నుక‌నే విష్ణుకు చ‌క్క‌ని మ‌ద్ద‌తు ల‌భించింది.

Manchu Vishnu won in maa elections these are the reasons for his victory

ఇక చివ‌రిగా మంచు విష్ణుకు వైసీపీ మ‌ద్ద‌తు, లాబీయింగ్ ల‌భించింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇది ఎంత నిజ‌మో తెలియ‌దు కానీ.. ఇటీవ‌లే మంత్రి పేర్ని నాని త‌మ‌కు, త‌మ పార్టీకి, మా ఎన్నిక‌ల‌కు సంబంధం లేద‌ని తేల్చేశారు. కానీ ఎంతో కొంత వైసీపీ ప్ర‌భావం ఉండే ఉంటుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

ఇక ఇన్ని కార‌ణాల వ‌ల్లే మంచు విష్ణు గెలిచార‌ని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు విష్ణు మా అధ్య‌క్షుడు అయ్యారు క‌దా.. అందువ‌ల్ల ఆయ‌న ముందు నుంచీ చెబుతూ వ‌స్తున్న‌ట్లు.. త‌న సొంత ఖ‌ర్చుల‌తో మా భ‌వ‌నం నిర్మించ‌డంతోపాటు చెప్పిన హామీల‌న్నీ నెర‌వేరుస్తారా, లేదా ? అన్న‌ది ఆస‌క్తిక‌రంగ మారింది. మొత్తానికి కొద్ది రోజుల నుంచీ నెల‌కొన్న న‌రాలు తెగే ఉత్కంఠ‌కు శుభం కార్డు ప‌డింద‌ని చెప్ప‌వ‌చ్చు. దీంతో న‌టీనటులు ఈ రాత్రి నుంచి ప్ర‌శాంతంగా నిద్ర పోతారు. ఓడిపోయిన వారు త‌ప్ప‌..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now