Manchu Vishnu : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి ఫ్యామిలీ మెంబర్స్ లీడర్లు కాలేరా అనే ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ విషయం ఒకటి, రెండు సార్లు కాదు.. ఎన్నో సార్లు రుజువవుతూనే ఉంది. చిరంజీవి వర్గం ఎప్పటికీ నాయకులు కాలేరని అంటున్నారు. ఎందుకంటే వారికి ఎంత గట్టి బలగం ఉన్నా.. ఆ బలాన్ని ఎలా వాడాలో తెలియదని, ఆ తెలివి ఎంత మాత్రం లేదని అంటున్నారు. ముఖ్యంగా పోటీకి దిగుతున్న వారి బలాన్ని అంచనా వేయడం అస్సలు రాదని, రాజకీయం అనేది పద్మవ్యూహం లాంటిదని, పూర్తిగా తెలుసుకోకుండా ఎంట్రీ ఇస్తే.. తిరిగి బయటకు రావడం మహా కష్టం అని చెబుతున్నారు. అలాగే ఆలోచనాశక్తి, నైపుణ్యం, చొరవ.. ఇవి ఏమాత్రం వంటబట్టని కుటుంబం చిరంజీవిదే.. అని ఘాటుగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఫోన్ తోనో.. వ్యక్తిగతంగానో ఓట్లు కలెక్ట్ చేసుకుంటారు. ప్రజల మనసుల్ని గెలుచుకున్నవారే నాయకుడు అవుతారు. మంచు విష్ణు ఆ పనే చేశారు. కానీ ప్రకాష్ రాజ్ చేయలేదు. ఆయన మొదటి స్పీచ్ లోనే ఖంగుతిన్నాడు. చిరంజీవి క్యాంపైనింగ్ లేకుండానే ప్రకాష్ రాజ్ ఈ స్పీచ్ ఇవ్వరు. ఈ క్రమంలో అసలు ప్రకాష్ రాజ్ స్పీచ్ లో ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం.. మొత్తం సభ్యులు 900 కాదు. నేనే లెక్కేసాను.. 150 మంది యాక్టివ్ మెంబర్స్ కాదు. 175 మంది స్థానికంగా ఉండరు. షూటింగ్స్ వచ్చి వెళ్తుంటారు. వచ్చి ఓటేయరు. జెనీలియా మహారాష్ట్ర సీఎం కొడుకుని రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్ళి చేసుకుని హ్యపీగా ఉంది.
ఆమె రాదు. ఇక మిగతావాళ్ళల్లో రామ్ చరణ్, నాగచైతన్య లాంటి వాళ్ళు రారు. 200 మంది మెంబర్స్ ఆర్థికంగా స్థిరపడ్డారు. అన్ని లెక్కలు పోగా మిగిలింది 250 మంది. వాళ్ళను ఆదుకోలేమా అంటూ ప్రకాష్ రాజ్ అన్నారు. ఇది విన్న వారికి ఎంత అమాయకంగా ఉంది.. అనే విషయం చాలా తేలికగా అర్థమవుతుంది. దీంతో అలెర్ట్ అయిన మంచు విష్ణు జెనీలియాని తీసుకొచ్చి ఓటేసేలా చేశారు. స్థానికేతరుల ఓట్లకు పోస్టల్ బ్యాలెట్ తో ఓటేయించారు. పెద్ద వాళ్ళు, చిన్నవాళ్ళనే తేడా లేకుండా అందరికీ ఫోన్ చేసి మాట్లాడి ఓట్లు పడేలా ప్లాన్ చేసుకున్నారు. నరేష్ ప్రెస్ మీట్ లో చేసిన కామెంట్స్ కి నాగబాబు కౌంటర్లు ఇవ్వమని పంపితే.. ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అనే టైటిల్ ని పొగొట్టేలా చేశారు.
దీంతో మా అధ్యక్షుడిగా ఎలా ఎన్నికవుతారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో కమ్మ వర్గం నుండి కాపు వర్గం చేతిలోకి వచ్చిసిందని.. పెద్ద దిక్కుగా చిరుని పిలుచుకోవాలనుకునేవారికి మంచు విష్ణు గెలుపుతో అది కూడా పోయింది. అయితే విష్ణు గెలుపుకి కేస్ట్ ఫీలింగ్ అయితే కాదు. కేవలం ప్రకాష్ రాజ్ వర్గం వారి తెలివితక్కువతనమే అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే వారి గొయ్యి వారే తవ్వుకున్నట్లుగా చేశారు. మరో హైలెట్ పాయింట్ ఏంటంటే.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో ఉన్న జీవితా రాజశేఖర్ కేవలం 7 ఓట్ల తేడాతో కోల్పోయింది. అల్లు అర్జున్, అల్లు శిరీష్ లతో పాటు వారి ఫ్యామిలీ నుండి 8 మంది వచ్చినా జీవితా రాజశేఖర్ గెలిచేది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…