Manchu Vishnu : బ‌న్నీని చూసి అసూయ క‌లిగింది.. కానీ చాలా ప్రౌడ్‌గా ఫీల‌వుతున్నా: మంచు విష్ణు

October 20, 2021 9:02 AM

Manchu Vishnu : మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేష‌న్ కొత్త అధ్య‌క్షుడిగా ఎంపికైన మంచు విష్ణు తాజాగా అల్లు అర్జున్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌తో మాట్లాడిన మంచు విష్ణు ‘మా’ ఎన్నికలతో పాటు మెగా కుటుంబంతో ఉన్న రిలేషన్‌షిప్‌పై కూడా స్పందించాడు. ఈ క్రమంలో బన్నీ తనకు మంచి మిత్రుడని, తరచూ ఇద్దరం చాటింగ్ చేసుకుంటామని అన్నారు.

Manchu Vishnu said he is proud of allu arjun

అలాగే అల్లు అర్జున్ అంటే అసూయ క‌లిగింద‌ని, కానీ అత‌డిని చూసి గ‌ర్వంగా కూడా ఫీల‌య్యాన‌ని అన్నారు మంచు విష్ణు. ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. బన్నీ నటిస్తున్న ‘పుష్ప’ మూవీ డిసెంబ‌ర్25న విడుద‌ల కానుంద‌ని ముందుగా ప్ర‌క‌టించారు. అదే సమయంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్‌ ఖాన్‌ ‘లాల్‌ సింగ్‌ చద్ధా’ కూడా విడుదలకు సిద్దమైంది. దీంతో బాలీవుడ్‌కు చెందిన పలు మ్యాగజైన్స్‌, వార్త పత్రికలు తెలుగు స్టార్‌ హీరో అల్లు అర్జున్‌, అమీర్‌ ఖాన్‌కు పోటీ ఇవ్వబోతున్నాడని రాశాయి.

ఈ వార్త‌లు చూసి నేను కాస్త జ‌ల‌స్ ఫీల‌య్యాను. అదే సమయంలో ఓ తెలుగు హీరోగా తనని చూసి గర్వపడ్డాను. ఇదే విషయాన్ని బన్నీకి కూడా చెప్పాను. ‘బ్రదర్, నేను నిన్ను చూసి అసూయపడుతున్నాను.. కానీ మీమ్మల్ని చూసి గర్వపడుతున్నా’ అని మెసెజ్‌ చేశాను’’ అని చెప్పుకొచ్చారు. మ‌న తెలుగోడి స‌త్తాను తెలియ‌జేశాడు బ‌న్నీఅంటూ ఆయ‌న‌పై ప్ర‌శంస‌లు కురిపించారు విష్ణు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now