Manchu Vishnu : మంచు విష్ణు కొత్త బిజినెస్‌..? ఇదైనా అదృష్టాన్ని తెచ్చి పెడుతుందా..?

January 27, 2022 10:26 PM

Manchu Vishnu : సినిమా ఇండ‌స్ట్రీలో చాలా మంది అగ్ర న‌టీన‌టుల‌కు సొంత నిర్మాణ సంస్థ‌లు ఉన్న విష‌యం విదితమే. అందుక‌నే ఫ్లాప్‌ల‌ను ఎదుర్కొన్నా.. కొన్ని సార్లు సొంత సంస్థ‌ల ఆధ్వ‌ర్యంలో సినిమాలు తీసి హిట్ కొట్టి మ‌ళ్లీ న‌టులు ఫామ్‌లోకి వ‌స్తుంటారు. ఇందుకు వారికి త‌మ సొంత నిర్మాణ సంస్థ‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంటాయి.

Manchu Vishnu reportedly started new business can he succeed in that

ఇక సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్‌బాబుకు కూడా ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ వంటి నిర్మాణ సంస్థ‌లు ఉన్నాయి. కానీ అవి ఉన్న‌ప్ప‌టికీ మంచు హీరోలు సినిమాల్లో హిట్‌లు కొట్ట‌లేక‌పోతున్నారు. అలాగే ఈ సంస్థ‌ల ఆధ్వర్యంలో ఇత‌ర హీరోల‌తో సినిమాలు తీసినా వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. అయితే ఇక‌పై మంచు విష్ణు మ‌రో కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్ట‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

మంచు విష్ణు అవా (ava) ఎంటర్‌టైన్‌మెంట్ పేరిట ఓ డిజిట‌ల్ సంస్థ‌ను స్థాపించిన‌ట్లు స‌మాచారం. ఈ సంస్థ పేరిట వెబ్ సిరీస్‌లు, బ‌డ్జెట్ మూవీల‌ను తీయ‌నున్నార‌ట‌. వాటిని ఓటీటీల కోస‌మే ప్ర‌త్యేకంగా తీస్తార‌ట‌. దీంతో ఓటీటీల‌కు వాటిని విక్ర‌యించి లాభాలు గ‌డించ‌వ‌చ్చ‌న్న‌మాట‌. ప్ర‌స్తుతం.. రాబోతున్న‌ది.. అంతా డిజిట‌ల్‌, ఓటీటీల యుగ‌మే క‌నుక‌.. ఈ దిశ‌గా వ్యాపారం చేస్తే అయినా స‌క్సెస్ కావొచ్చ‌ని మంచు విష్ణు ఆలోచించార‌ట‌. అందుక‌నే ఆ సంస్థ‌ను ఏర్పాటు చేశార‌ట‌.

అయితే దీనిపై త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి. ఇక దీంతోపాటు త్వ‌ర‌లోనే ఒక ఓటీటీ యాప్‌ను కూడా లాంచ్ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అంటే త్వ‌ర‌లో మంచు వారి ఓటీటీ యాప్ కూడా రంగ ప్రవేశం చేస్తుంద‌న్న‌మాట‌. మ‌రి ఆహాకు అది పోటీనిస్తుందా.. లేదా.. అస‌లు మంచు వారు ఓటీటీ యాప్‌ను తెస్తారా.. లేదా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now