Manchu Vishnu : ప్ర‌కాశ్ రాజ్‌తో వాట్సాప్ ఛాటింగ్ బ‌య‌ట‌పెట్టిన మంచు విష్ణు.. షాక్‌లో ఫ్యాన్స్..

October 11, 2021 6:15 PM

Manchu Vishnu : మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేష‌న్ ఎన్నిక‌ల‌లో ప్ర‌కాశ్ రాజ్‌పై మంచు విష్ణు 107 ఓట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. త‌న‌ను తెలుగు వాడిగా యాక్సెప్ట్ చేయ‌ని కారణంగా ప్ర‌కాశ్ రాజ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. లోకల్, నాన్ లోకల్ అనే గొడవ బాగా ప్రభావం చూపిందనే చెప్పాలి. దీంతో ప్రకాశ్ రాజ్ తాను మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు.

Manchu Vishnu released whatsapp chat between him and prakash raj

కళాకారుడిగా తనకు ఆత్మగౌరవం ఉందని, అందుకే రాజీనామా చేస్తున్నానని తెలిపారు. తన ఓటమిని అంగీకరిస్తున్నానని ప్రకాశ్ రాజ్ చెప్పారు. తన తల్లిదండ్రులు తెలుగువారు కాకపోవడం తన తప్పు కాదని ఆయన అన్నారు. అతిథిగా వచ్చానని, అతిథిగానే తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగుతానని చెప్పారు ప్రకాశ్ రాజ్. అయితే ఈ క్ర‌మంలోనే మంచు విష్ణుకు అభి నందనలు తెలుపుతూ మా సభ్వత్వానికి తన రాజీనామాను యాక్సెప్ట్ చేయమని, మా లో నాన్ మెంబర్ గా తన సేవలందిస్తానని అన్నాడు.

వాట్సాప్‌లో ప‌ర్స‌న‌ల్‌గా ప్ర‌కాశ్ రాజ్ మెసేజ్ పెట్ట‌డంతో దానిని సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన విష్ణు.. డియర్ అంకుల్ మీ అభినందనలకి థాంక్స్. కానీ మీ నిర్ణయానికి నేను బాధపడుతున్నాను. మీరు నాకన్నా పెద్దవారు. మీకు తెలుసు కదా.. గెలుపు, ఓటములు బొమ్మా, బొరుసు లాంటివని. మా కుటుంబంలో మీరు కూడా సభ్యులే. నాకు మీ ఐడియాస్ కావాలి. మనిద్దరం కలిసి పనిచేద్దాం. మళ్లీ నాకు రిప్లై ఇవ్వొద్దని కోరుతున్నాను. త్వరలోనే మిమల్ని కలుస్తాను.. అని విష్ణు రిప్లై ఇచ్చారు. ఇప్పుడు ఈ ఇద్ద‌రి ఛాటింగ్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment