Manchu Vishnu : ఇక నుండి మీడియాకు ఎక్కం.. మంచు విష్ణు సంచ‌ల‌న కామెంట్స్..

October 16, 2021 10:56 PM

Manchu Vishnu : అసెంబ్లీ ఎన్నిక‌ల క‌న్నా దారుణంగా మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేష‌న్ ఎన్నిక‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. మంచు విష్ణు ప్యానెల్, ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్ మ‌ధ్య ఏ రేంజ్‌లో మాట‌ల దాడి జ‌రిగిందో మ‌నంద‌రం చూశా. ఎన్నిక‌ల త‌ర్వాత కూడా ఇదే జ‌రిగింది. అయితే ‘మా’ నూతన అధ్యక్షుడిగా శనివారం మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్నికల ముందు ప్రకటించిన మా మేనిఫెస్టోలో ప్రస్తావించిన ప్రతీ అంశం అమలు జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.

Manchu Vishnu comments on becoming maa president

‘మా’ అభివృద్ధి కోసం అందరం కలిసి కట్టుగా పని చేద్దామని ‘మా’ కార్యవర్గానికి ఆయన పిలుపునిచ్చారు. అయితే ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్ స‌భ్యులు రాజీనామా చేయ‌డం ప‌ట్ల మంచు విష్ణు ఆందోళ‌న చెందారు. ‘‘మా’ ఎన్నికల్లో మేము గెలిచాం. పత్యర్థి ప్యానల్‌ వాళ్లు దీన్ని గౌరవించాలి. ఎన్నిక ఫలితాల అనంతరం ప్రత్యర్థి ప్యానల్‌ వాళ్లు రాజీనామాలు చేశారు. వారి కారణాలు వారికి ఉండొచ్చు. అది చాలా దురదృష్టకరం.

మా’ అసోసియేషన్‌ అభివద్ధికి కోసం ఏ కార్యక్రమాలను చేపట్టినా వారి సలహా తీసుకుంటాను. వారి సపోర్టు నాకు ఉంటుందని ఆశిస్తున్నా’’ అంటూ మంచు విష్ణు స్ప‌ష్టం చేశారు. ఇక నుండి ‘మా’ ఎన్నికలపై మీడియాలో మాట్లాడమని, కేవలం తాము చేయబోయే కార్యక్రమాల గురించే మాట్లాడతామంటూ.. విష్ణు వ్యాఖ్యానించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now