Manchu Vishnu : మంచు విష్ణుపై మ‌ళ్లీ ట్రోలింగ్‌.. ప‌బ్లిగ్గా అలాంటి ప‌నులేంటి..?

May 31, 2022 10:59 AM

Manchu Vishnu : మంచు విష్ణు చాలా గ్యాప్ త‌రువాత న‌టిస్తు్న చిత్రం.. గాలి నాగేశ్వ‌ర్ రావు. ఈ మూవీలో స‌న్నీ లియోన్‌, పాయ‌ల్ రాజ్‌పూత్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా.. షూటింగ్ ప‌నుల‌ను శర‌వేగంగా చేప‌డుతున్నారు. కామెడీ జోన‌ర్‌లోఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. మంచు విష్ణు సోద‌రుడు మంచు మ‌నోజ్ హీరోగా వ‌చ్చిన కరెంటు తీగ‌లోనూ స‌న్నీ లియోన్ మెరిసింది. ఆ త‌రువాత ఇప్పుడు త‌న సోద‌రుడి సినిమాలో ఈమె న‌టిస్తోంది. ఇక షూటింగ్ కార‌ణంగా గ‌త కొంత కాలంగా స‌న్నీ లియోన్ హైద‌రాబాద్‌లోనే ఉంటోంది.

అయితే ఖాళీ దొరికిన‌ప్పుడ‌ల్లా మంచు విష్ణు, స‌న్నీ లియోన్‌, పాయ‌ల్ రాజ్‌పూత్‌లు స‌ర‌దాగా గ‌డుపుతూనే ఉన్నారు. ఈ మ‌ధ్యే వారు ఓ ఫ‌న్నీ సంఘ‌ట‌న‌లో పాలు పంచుకున్నారు. స‌న్నీ, పాయ‌ల్ ఇద్ద‌రిలో ఎవ‌రు అందంగా ఉంటార‌ని అడ‌గ్గా.. విష్ణు ఒక్కోసారి ఒక‌రి పేరు చెప్పారు. త‌రువాత ఎవ‌రూ కాదు.. అన్నారు. దీంతో ఇద్ద‌రూ విష్ణును చిత‌క‌బాదారు. అయితే ఇప్పుడు విష్ణు అలాంటి ఓ చిలిపి ప‌ని చేశారు. సన్నీ లియోన్‌కు ముద్దు ఇస్తున్న‌ట్లు పోజు పెట్టారు. అదే ఫొటోలో పాయ‌ల్ రాజ్‌పూత్ విక్ట‌రీ సింబ‌ల్ ను చూపిస్తోంది. కాగా ఈ ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారింది.

Manchu Vishnu again trolled by netizen for his posts
Manchu Vishnu

కాగా ఈ ఫొటోను చూసి నెటిజ‌న్లు అనేక ర‌కాలుగా స్పందిస్తున్నారు. మంచు విష్ణుకు రొమాన్స్ ఎక్కువైంద‌ని కొంద‌రు అంటుండ‌గా.. ప‌బ్లిగ్గా ఇలాంటి ప‌నులేంటి అని విమ‌ర్శిస్తున్నారు. గ‌తంలోనూ ఓ సారి స‌న్నీ లియోన్ వీపు మీద ఆమ్లెట్ వేయాల‌ని చూసి నెటిజ‌న్ల‌చే విష్ణు విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు. అయితే అదింకా మ‌రిచిపోక ముందే మ‌ళ్లీ ఆమెతో అలాగే ప్ర‌వ‌ర్తించాడు. దీంతో విష్ణును మ‌ళ్లీ నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now