Manchu Lakshmi : మంచు వారి అమ్మాయి మంచు లక్ష్మి నటిగా తనని ప్రూవ్ చేసుకోవాలని అప్పట్లో గట్టి ప్రయత్నాలే చేసింది. సొంత నిర్మాణంలో సినిమాలు చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాకపోవడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చి హోస్ట్ గా మారి స్పెషల్ హోస్ చేసింది. మంచు లక్ష్మి హోస్ట్ గా లక్ష్మి టాక్ షో.. మేము సైతం షోలు ఆడియెన్స్ ని అలరించాయి. అవి పూర్తయ్యాక కేవలం సోషల్ మీడియా ద్వారా ఆడియెన్స్ కి టచ్ లో ఉంటోంది మంచు లక్ష్మి. తన ప్రతి అప్‌డేట్ ని సోషల్ మీడియాలో పెడుతూ అలరిస్తోంది మంచు వారి అమ్మాయి. ఫిట్ నెస్ స్టోరీస్ పేరిట.. తన కూరుతు నిర్వాణ గురించి సోషల్ మీడియాలో పెడుతూ వస్తోంది మంచు లక్ష్మి.
తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో రెగ్యులర్ చాట్స్ అయితే చాలా కామన్. ఇక ఇదిలా ఉండగా మంచు లక్ష్మి లేటెస్ట్ గా గాయాలతో ఉన్న ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ముఖం మీద గాయాలు.. చేతికి బాగా దెబ్బ తగిలినట్టుగా ఉన్న ఫోటోలను షేర్ చేసింది మంచు లక్ష్మి. అవి చూసి ఆమె ఫ్యాన్స్ అంతా కంగారు పడ్డారు. అయితే ఇందులో కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదని, ప్రస్తుతం తాను చేస్తున్న సినిమా కోసం తాను వేసుకున్న మేకప్ అని చెప్పి షాక్ ఇచ్చింది మంచు లక్ష్మి. ఈ సోషల్ మీడియా వచ్చాక ఏది రియలో ఏదో అన్ రియలో అన్నది తెలియట్లేదు. అదీగాక ముందు గాయాల ఫోటో పెట్టి తూచ్ నాకేం కాలేదోచ్ అంటే ఎలా చెప్పండి.
ప్రస్తుతం మంచు లక్ష్మి అగ్ని నక్షత్రం సినిమా చేస్తోంది. ఆ సినిమా కోసం ఆమె ఈవిధంగా మేకోవర్ అయ్యింది. మంచు మోహన్ బాబు తనయురాలిగా నటనలో తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తోంది మంచు లక్ష్మి. అయితే ఆమెకు సరైన అవకాశాలు రావట్లేదని మాత్రం చెప్పొచ్చు. చాలా గ్యాప్ తర్వాత ఈ అగ్ని నక్షత్రం సినిమాలో నటిస్తోంది మంచు లక్ష్మి. ఈ సినిమాతో అయినా ఆమె కెరియర్ టర్న్ అవుతుందేమో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…