Manchu Lakshmi : యోగా ఫొటోలను షేర్‌ చేసిన మంచు లక్ష్మి.. షాకవుతున్న నెటిజన్లు..!

June 21, 2022 6:59 PM

Manchu Lakshmi : సీనియర్‌ నటుడు మోహన్‌ బాబు నట వారసురాలిగా టాలీవుడ్‌లో అడుగు పెట్టిన మంచు లక్ష్మి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తన నటనతోపాటు తన యాసతోనూ ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఈమె మాట్లాడే మాటలపై తెగ ట్రోల్స్‌ వస్తుంటాయి. ఈమె తెలుగులో అనగనగా ఓ ధీరుడు సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ మూవీ నిరాశ పరిచింది. అయితే అంతకు ముందే పలు హాలీవుడ్‌ మూవీలలో నటించింది. కానీ వాటి గురించి చాలా మందికి తెలియదు.

మంచు లక్ష్మి హాలీవుడ్‌లో ది ఓడ్‌, డెడ్‌ ఎయిర్‌, థాంక్‌ యూ ఫర్‌ వాషింగ్‌ అనే సినిమాల్లో నటించింది. కానీ వీటి గురించి చాలా మందికి తెలియదు. ఇక ఇప్పటికీ ఈమె సినిమాల్లో నటిస్తూనే ఉంది. అందులో భాగంగానే మళయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ సినిమాలో ఈమె పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తోంది. అయితే సోషల్‌ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉండే మంచు లక్ష్మి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాసనాలు వేసి అలరించింది.

Manchu Lakshmi shared yoga photos
Manchu Lakshmi

జూన్‌ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అనేక మంది సెలబ్రిటీలు యోగా చేశారు. ఆ ఫొటోలను వారు తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేశారు. ఇక మంచు లక్ష్మి కూడా ఆసనాలు వేసింది. ఈ క్రమంలోనే ఆమె బిగుతైన దుస్తులను ధరించి యోగా చేసిన ఫోటోలను షేర్‌ చేయగా.. అవి వైరల్‌ అవుతున్నాయి. ఆమె యోగాసనాలను చూసి నెటిజన్లు షాకవుతున్నారు. చాలా బాగా యోగా చేశావ్‌.. అని కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now