Manchu Lakshmi : వామ్మో.. మంచు ల‌క్ష్మి ఏంటి.. ఇలా మారిపోయింది..!

March 29, 2022 2:15 PM

Manchu Lakshmi : మంచు ల‌క్ష్మి అంటేనే మ‌న‌కు స‌హ‌జంగానే ఆమె మాట్లాడే భాష‌.. యాస గుర్తుకు వ‌స్తాయి. ఆమె మాట్లాడే మాట‌లు న‌వ్వు తెప్పిస్తుంటాయి. అయిన‌ప్ప‌టికీ ఆమె ఆ విధంగానే మాట్లాడుతుంది త‌ప్ప వెన‌క్కి త‌గ్గ‌దు. ఇక ఇప్ప‌టికే ఆమె అనేక సినిమాల్లో ప‌లు భిన్న పాత్ర‌ల్లో న‌టించింది. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఆమె న‌టించిన సినిమాలు ఒక్క‌టి కూడా హిట్ కాలేదు. కానీ న‌ట‌న‌లో త‌న‌కంటూ ఓ గుర్తింపును మాత్రం తెచ్చుకుంది. ఇక సోష‌ల్ మీడియాలోనూ ఈమె ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.

Manchu Lakshmi shared world theatre day photo viral
Manchu Lakshmi

మంచు ల‌క్ష్మి ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ మ‌ధ్యే క‌ల‌రి ప‌ట్టు అనే కేర‌ళ విద్యను నేర్చుకుంటూ దాని ఫొటోల‌ను కూడా షేర్ చేసింది. ఇక తాజాగా ఈమె మ‌రోమారు ఓ భిన్న క్యారెక్ట‌ర్‌లో ఉన్న ఫొటోను షేర్ చేసింది. ఇందులో మంచు ల‌క్ష్మి విచిత్ర వేష‌ధార‌ణ‌లో ఉండ‌డం విశేషం. దీంతో ఆమెను చూసిన వారంద‌రూ ఆమెకు ఏమైంది.. అని ఆరాలు తీయ‌డం మొద‌లు పెట్టారు.

ప్ర‌పంచ థియేట‌ర్ డే సంద‌ర్భంగా మంచు ల‌క్ష్మి ఓ నాట‌కంలో పాల్గొంది. అందులో వేసిన వేషం తాలూకు ఫొటోనే అది. దీంతో ఈ ఫొటో వైర‌ల్‌గా మారింది. అయితే ఈ విష‌యం తెలియ‌ని చాలా మంది నిజంగానే ఆమెకు ఏదో జ‌రిగింద‌ని ఖంగారు ప‌డుతున్నారు. ఇక మంచు ల‌క్ష్మి ప్ర‌స్తుతం సినిమాల‌తోనూ బిజీగా ఉంది. మ‌ళ‌యాళ స్టార్ న‌టుడు మోహ‌న్‌లాల్‌తో క‌లిసి ఈమె ఓ సినిమాలో న‌టిస్తోంది. అలాగే మ‌రో త‌మిళ మూవీలో పోలీస్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now