Manchu Lakshmi : ఇక చాలు ఆపండి.. అంటూ నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంచు లక్ష్మి..!

October 18, 2021 12:58 PM

Manchu Lakshmi : మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా ఏ విధమైన పోస్ట్ చేసినా అది తీవ్రస్థాయిలో వైరల్ అవుతుంటుంది. ఈ క్రమంలోనే నెటిజన్ల నుంచి మంచు లక్ష్మి ఎన్నో నెగిటివ్ కామెంట్లను ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. తాజాగా జరిగిన మా అధ్యక్ష ఎన్నికలలో భాగంగా మంచు విష్ణు గెలుపొందిన సంగతి తెలిసిందే. మంచు విష్ణు మా అధ్యక్షుడిగా గెలుపొంది ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచు లక్ష్మి ట్విట్టర్ ద్వారా స్పందించింది.

Manchu Lakshmi  angry reply over netizen comments

ఈరోజు మా కుటుంబానికి ఎంతో శుభదినం.. మా తమ్ముడు మా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేస్తున్న నేపథ్యంలో అతనికి శుభాకాంక్షలు.. అధ్యక్షుడిగా నువ్వు ఈ ప్రపంచాన్ని మార్చడానికి ఈ రోజు నుంచి పని చేస్తున్నావు.. ఆల్ ది బెస్ట్.. అంటూ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు మా అధ్యక్షుడు ప్రపంచాన్ని ఎలా మార్చగలడు అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. ఈ కామెంట్స్ చూసిన మంచు లక్ష్మి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. ఇక చాలు ఆపండి.. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా.. ఎవరిని కామెంట్ చేద్దామా.. అని ఎదురుచూస్తుంటారు. సినిమా వాళ్లకు మా ఒక ప్రపంచం. అందులో మార్పు తీసుకురావాలని చెప్పడమే నా ఉద్దేశం. అర్థం చేసుకోండి.. అంటూ నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now