Manchu Lakshmi : మంచు ల‌క్ష్మి గొప్ప మ‌న‌సు.. 50 స్కూళ్ల‌ను ద‌త్త‌త తీసుకుంది..!

July 22, 2022 12:53 PM

Manchu Lakshmi : సినీ న‌టుడు మంచు మోహ‌న్ బాబు కుటుంబాన్ని ఈమధ్య కాలంలో ఎన్న‌డూ లేని విధంగా ట్రోల్ చేస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా మా అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా మంచు విష్ణు ఎన్నికైన‌ప్ప‌టి నుంచి ఈ ట్రోల్స్ మ‌రింత ఎక్కువ‌య్యాయి. అయితే అవి అంత‌టితో ఆగిపోయేవి. కానీ ఏపీలో సినీ రంగ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో మా ప్రెసిడెంట్ అయి ఉండి కూడా విష్ణు ఏం చేయ‌లేక‌పోయార‌నే అపవాదు వ‌చ్చింది. దీంతో ఆయ‌న‌పై, ఆయ‌న కుటుంబంపై ట్రోల్స్ మరింత ఎక్కువ‌య్యాయి. ఒక ద‌శ‌లో ఆ ట్రోల్స్‌ను వారు భరించ‌లేక కోర్టుకు కూడా వెళ్తామ‌ని హెచ్చ‌రించారు. అయిన‌ప్ప‌టికీ వారి మీద వ‌స్తున్న ట్రోల్స్ ఆగ‌డం లేదు.

ఇక ఈ ట్రోల్స్ విషయం అటుంచితే తాజాగా మోహ‌న్ బాబు కుమార్తె, సినీ న‌టి మంచు ల‌క్ష్మి త‌న గొప్ప మ‌న‌సు చాటుకుంది. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో ఆమె ప‌ర్య‌టించింది. అక్క‌డి ప్ర‌భుత్వ స్కూల్స్‌లో విద్యార్థుల‌కు ల‌భిస్తున్న సౌక‌ర్యాల‌ను ప‌రిశీలించిన ఆమె ఆ జిల్లాలో ఉన్న 50 ప్ర‌భుత్వ స్కూల్స్‌ను ద‌త్త‌త తీసుకుంటున్న‌ట్లు తెలియ‌జేసింది. పేద విద్యార్థుల‌కు నాణ్య‌తా ప్ర‌మాణాల‌తో కూడిన విద్య‌ను అందించాల‌నే ఉద్దేశంతోనే ఆయా స్కూళ్ల‌ను ద‌త్త‌త తీసుకుంటున్న‌ట్లు తెలియ‌జేసింది. దీంతో నెటిజ‌న్లు సైతం ఆమెను ప్ర‌శంసిస్తున్నారు.

Manchu Lakshmi adopted 50 schools in Telangana
Manchu Lakshmi

ఇక మంచు లక్ష్మి ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో ఎంతో బిజీగా ఉంది. మ‌ళ‌యాళ న‌టుడు మోహ‌న్‌లాల్‌తో క‌లిసి ఓ మూవీలో ఈమె న‌టిస్తుండ‌గా.. త‌న తండ్రి మోహ‌న్ బాబుతో క‌లిసి అగ్ని న‌క్ష‌త్రం అనే మూవీ చేస్తోంది. ఈ మూవీకి చెందిన టైటిల్ టీజ‌ర్‌ను ఇటీవ‌లే విడుద‌ల చేశారు. అయితే మంచు ల‌క్ష్మి గొప్ప మ‌న‌సు తెలిసి అంద‌రూ ఆమెను ప్ర‌శంస‌ల్లో ముంచెత్తుతున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా ఆమెపై వ‌స్తున్న ట్రోల్స్ త‌గ్గుతాయో లేదో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now