Manchi Rojulochaie Review : మంచి రోజులొచ్చాయి.. మూవీ రివ్యూ..

November 4, 2021 9:59 AM

Manchi Rojulochaie Review : మంచి రోజులొచ్చాయి మూవీ కోసం చిత్ర యూనిట్ ఇటీవ‌లి కాలంలో అనేక ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను చేపట్టింది. చిత్ర ద‌ర్శ‌కుడు మారుతి, హీరో సంతోష్ శోభ‌న్‌, హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదాలు ఇటీవ‌ల బిగ్‌బాస్‌లోనూ క‌నిపించి సంద‌డి చేశారు. ఈ మూవీ దీపావ‌ళి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు ఓ లుక్కేద్దామా..!

Manchi Rojulochaie Review know how is the movie

Manchi Rojulochaie Review : క‌థ

గోపాల్ తిరుమ‌ల‌శెట్టి (అజ‌య్ ఘోష్‌)కు కూతురు ప‌ద్మ (మెహ్రీన్‌) అంటే ప్రాణం. ఆమెను ఎప్పుడూ భ‌ద్రంగా చూసుకుంటుంటాడు. ఈ క్ర‌మంలో సంతు (సంతోష్ శోభ‌న్‌), ప‌ద్మ డీప్ గా ల‌వ్‌లో మునిగి తేలుతుంటారు. అయితే ఈ విష‌యం గోపాల్‌కు అత‌ని స్నేహితుల ద్వారా తెలుస్తుంది. వారు అత‌న్ని భ‌య‌పెడ‌తారు. నీ కూత‌రు వ‌ల్ల నీ కుటుంబం నాశ‌నం అవుతుంది, జాగ్రత్త‌.. అని హెచ్చ‌రిస్తారు. దీంతో గోపాల్ అప్ సెట్ అయి కుమార్తె ప‌ట్ల మ‌రింత కేర్ తీసుకుంటుంటాడు. అయితే త‌న మామ‌ను సంతు ఎలా మేనేజ్ చేశాడు, ఆయ‌న ఆశీర్వాదాలు ల‌భించాయా ? త‌న ల‌వ్‌ను స‌క్సెస్ చేసుకున్నాడా ? అన్న విష‌యాలు తెలియాలంటే.. సినిమాను వెండితెర‌పై చూడాల్సిందే.

నిజ జీవితానికి సంబంధించిన పాయింట్ల‌ను తీసుకుని ద‌ర్శ‌కుడు మారుతి సినిమాల‌ను తెర‌కెక్కిస్తుంటాడు. ఇక ఇందులోనూ అదే విధంగా ఓ పాయింట్ తీసుకున్నాడు. అది భ‌యం. ఆడ‌పిల్ల తండ్రికి స‌హ‌జంగానే ఉండే భ‌యాన్ని ఇందులో చూపించారు. దీంతోపాటు చ‌క్క‌ని కామెడీని కూడా వ‌ర్క‌వుట్ చేశారు. మెహ్రీన్‌, అజ‌య్ ఘోష్‌, సంతోష్ శోభ‌న్‌, వెన్నెల కిశోర్‌, ప్ర‌వీణ్, వైవా హ‌ర్ష‌, సుధాక‌ర్ వంటి వారు త‌మ పాత్ర‌ల ప‌రిధి మేర బాగానే న‌టించి అల‌రించారు.

సినిమాను నిజానికి 2 గంట‌ల్లోపే ముగించ‌వ‌చ్చు. కానీ 20 నిమిషాల‌ను పొడిగించారు. దీంతో సినిమా కాస్త నెమ్మ‌దిగా న‌డుస్తుంద‌న్న భావ‌న క‌లుగుతుంది. అలాగే క‌రోనా యాంగిల్‌ను సినిమాలో చొప్పించారు. కానీ అదంత పెద్ద ప్ర‌భావాన్ని చూపించ‌లేద‌నే చెప్పాలి. ఇక మూవీ క్లైమాక్స్ కూడా ముందుగా ఊహించిన‌ట్లే ఉంటుంది. పెద్ద ట్విస్టులు ఏమీ ఉండ‌వు. అందువ‌ల్ల యావ‌రేజ్ అన్న ఫీలింగ్ వ‌స్తుంది.

అయితే ప్రొడ‌క్ష‌న్ విలువ‌లు, మ్యూజిక్‌, డైలాగ్‌లు బాగున్నాయి. కెమెరా వ‌ర్క్ కూడా బాగానే ఉంది. ద‌ర్శ‌కుడు మారుతి స‌హ‌జంగానే కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ జోన‌ర్‌లో సినిమాలు తీస్తారు. క‌నుక కామెడీని, చ‌క్క‌ని వినోదాన్ని కోరుకునే వారు ఈ మూవీని క‌చ్చితంగా ఎంజాయ్ చేస్తార‌ని చెప్ప‌వ‌చ్చు. ఆ జోన‌ర్‌లు అంటే ఇష్ట‌ప‌డే వారు క‌చ్చితంగా ఈ మూవీని ఒక‌సారి చూడ‌వ‌చ్చు. వీకెండ్‌లో స‌ర‌దాగా ఈ మూవీని చూసి న‌వ్వుకోవ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now