Sonu Sood : భార్య న‌ర‌కం చూపిస్తోంది.. ర‌క్షించండి.. అని కోరిన వ్య‌క్తి.. అందుకు సోనూసూద్ ఇచ్చిన రిప్లై అదుర్స్‌..!

April 14, 2022 7:36 PM

Sonu Sood : క‌రోనా క‌ష్ట‌కాలంలో న‌టుడు సోనూ సూద్ ప్ర‌జ‌ల‌కు ఎంత సహాయం చేశాడో అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న ఎంతో మంది వ‌ల‌స కార్మికుల‌ను, కూలీల‌ను బస్సులు, విమానాలు అరేంజ్ చేసి సొంతూళ్ల‌కు పంపించాడు. ఇక క‌రోనా రెండో వేవ్ స‌మ‌యంలో ఆయ‌న దేశ‌మంత‌టా ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేసి బాధితుల‌కు పున‌ర్జ‌న్మ ఇచ్చాడు. అయితే సోనూసూద్ ఇప్ప‌టికీ ప్ర‌జాసేవ‌ను కొన‌సాగిస్తూనే ఉన్నాడు. ముంబైలోని త‌న ఇంటికి స‌హాయం కోసం వ‌చ్చే బాధితుల‌కు.. కాదు.. లేదు.. అన‌కుండా స‌హాయం చేస్తూనే ఉన్నాడు.

man requests help from Sonu Sood to save him from his wife
Sonu Sood

ఇక సోనూసూద్ ను చాలా మంది సోష‌ల్ మీడియా వేదిక‌గా స‌హాయం అడుగుతుంటారు. ఆయ‌న ట్విట్ట‌ర్‌లో యాక్టివ్‌గా ఉంటారు క‌నుక‌.. ఆయ‌న‌కు ట్విట్ట‌ర్‌లో మెసేజ్‌లు పెడుతుంటారు. అందుకు ఆయ‌న బ‌దులిస్తుంటారు. అయితే కొంద‌రు మాత్రం అప్పుడ‌ప్పుడు చాలా ఫ‌న్నీ అయిన ప్ర‌శ్న‌లు వేస్తుంటారు. కొంద‌రు వింతైన రీతిలో స‌హాయం చేయాల‌ని అడుగుతుంటారు. వాటికి కూడా సోనూసూద్ బ‌దులిస్తుంటాడు. ఇక తాజాగా ఓ నెటిజ‌న్ అలాగే వింతైన రీతిలో స‌హాయం చేయ‌మ‌ని అడిగాడు. అందుకు సోనూసూద్ కూడా అలాగే వింత‌గా రిప్లై ఇచ్చాడు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే..

త‌న భార్య త‌న‌ను చిత్ర హింస‌ల‌కు గురి చేస్తుంద‌ని, త‌న ర‌క్తం తాగేలా ప్ర‌వ‌ర్తిస్తుంద‌ని, దీనికి ఆమెకు ఏదైనా చికిత్స చేయించాల‌ని.. అందుకు స‌హాయం చేయాల‌ని.. ఓ వ్య‌క్తి సోనూసూద్‌ను సహాయం కోరాడు. అయితే అందుకు సోనూసూద్ స్పందించారు. దీనికి చికిత్స ఏమీ ఉండ‌ద‌ని.. భార్య‌లు అలాగే చేస్తార‌ని.. వారికి అది జ‌న్మ హ‌క్కు అని.. క‌నుక మీ ర‌క్తంతో ఒక బ్ల‌డ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసి సేవ‌లు అందించండి.. అంటూ సోనూ అత‌నికి రిప్లై ఇచ్చారు. దీంతో సోనూ ఇచ్చిన స‌మాధానం వైర‌ల్ అవుతోంది. అలాంటి వారికి అలాగే స‌మాధానం ఇవ్వాలి.. చాలా బాగా రిప్లై ఇచ్చారు సోనూ భాయ్‌.. అంటూ చాలా మంది నెటిజ‌న్లు ఆయ‌నపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now