Onion Rings : ఆనియ‌న్ రింగ్స్ ను ఫుడ్ డెలివ‌రీ యాప్‌లో ఆర్డ‌ర్ చేస్తే.. ఏం వ‌చ్చాయో చూడండి..!

June 18, 2022 12:34 PM

Onion Rings : ప్ర‌స్తుత త‌రుణంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివ‌రీ యాప్ ల ప్ర‌భావం ఏవిధంగా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అనేక యాప్‌ల ద్వారా మ‌న‌కు ఫుడ్ డెలివ‌రీ చేసుకునే స‌దుపాయం ఏర్ప‌డింది. దీంతో యాప్‌లు పోటాపోటీగా మ‌న‌కు ఆఫ‌ర్ల‌ను అంద‌జేస్తున్నాయి. ఇక రెస్టారెంట్లు సైతం భోజ‌న ప్రియుల‌కు అనేక ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నాయి. హోట‌ల్స్‌లో క‌న్నా యాప్‌ల ద్వారా ఫుడ్‌ను ఆర్డ‌ర్ చేస్తేనే మ‌న‌కు ఆఫ‌ర్లు ఎక్కువ‌గా ల‌భిస్తున్నాయి. దీంతో చిన్న చిన్న వంట‌కాల‌ను కూడా చాలా మంది ఇంట్లో చేసుకోకుండా ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ పెడుతున్నారు. అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.. కానీ మ‌నం పెట్టిన ఆర్డ‌ర్ తాలూకు ఫుడ్ కాకుండా వేరేది వ‌స్తే ఎలా ఉంటుంది ? అప్పుడు ప‌డే బాధ‌ను మాట‌ల్లో చెప్ప‌లేం. అవును.. స‌రిగ్గా అత‌నికి కూడా అలాగే జ‌రిగింది. ఇంత‌కీ అస‌లు విషయం ఏమిటంటే..

ఆన్‌లైన్ లో ఓ ఫుడ్ డెలివ‌రీ యాప్‌లో ఓ వ్య‌క్తి ఫ్రైడ్ ఆనియ‌న్ రింగ్స్ ఆర్డ‌ర్ పెట్టాడు. ఉల్లిపాయ‌ల‌ను చ‌క్రాల్లా స‌న్న‌ని రింగుల్లా క‌ట్ చేసి వాటిని నూనెలో వేయించి ప‌కోడీల మాదిరిగా త‌యారు చేస్తారు. వాటినే ఆనియ‌న్ రింగ్స్ అని పిలుస్తారు. అయితే వీటిని ఆర్డ‌ర్ పెడితే వీటికి బ‌దులుగా ప‌చ్చి ఉల్లిపాయలు వ‌చ్చాయి. ప‌చ్చి ఉల్లిపాయ‌ల‌ను నీట్‌గా స‌న్న‌ని రింగుల్లా క‌ట్ చేసి పంపించారు. దీంతో వాటిని చూసి అత‌ను ముందుగా షాక‌య్యాడు. అయితే ఆ ఫుడ్ డెలివ‌రీ యాప్‌కు, ఆ రెస్టారెంట్ వాళ్ల‌కు బుద్ధి చెప్ప‌డం కోసం అత‌ను ఆ ఉల్లిపాయ‌ల‌ను ఫొటో తీసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

man ordered Onion Rings see what came from order
Onion Rings

కాగా ఆ ఫొటోను చూసిన నెటిజ‌న్లు షాకై భిన్న ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఉల్లిపాయ‌ల రింగ్స్ ఆర్డ‌ర్ చేస్తే వ‌చ్చాయి క‌దా.. ఇంకెందుకు బాధ అని కొంద‌రు అత‌న్ని ఆట ప‌ట్టిస్తుండ‌గా.. ఇంకొంద‌రు మాత్రం.. ఆ ఫొటోను షేర్ చేసి వారికి త‌గిన బుద్ధి చెప్పావ‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఆ ఫొటో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. అయితే వాటిని యాప్ నిర్వాహ‌కులు మార్చి మ‌ళ్లీ ఆనియ‌న్ రింగ్స్‌ను పంపించారా.. అస‌లు త‌రువాత ఏమైంది.. అన్న వివ‌రాలు మాత్రం తెలియ‌లేదు. కానీ ఈ వార్త సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by UbaidU (@ubaidu_15)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now