iPhone : ఇది మామూలు మోసం కాదు.. వాడే ఫోన్‌నే అమ్మ‌కానికి పెట్టారు, స‌బ్బు బిళ్ల పంపారు..!

iPhone : ఆన్ లైన్ లో ఫోన్ల‌ను ఆర్డ‌ర్ చేస్తే స‌బ్బు బిళ్ల‌లు, ఇటుక‌లు వ‌చ్చిన సంఘ‌ట‌న‌ల‌ను మ‌నం గ‌తంలో ఎన్నో చూశాం. అయితే అలాంటి మోసాల‌ను ఎక్కువ‌గా డెలివ‌రీ బాయ్స్ చేసేవారు. క‌నుక వాటికి చెక్ పెట్టేలా ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు ప‌క‌డ్బందీగా చ‌ర్య‌లను తీసుకుంటున్నాయి. ఇక ఇటీవ‌లి కాలంలోనే ఓ కొత్త స‌దుపాయాన్ని ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు వినియోగ‌దారుల‌కు అందిస్తున్నాయి. దాంతో డెలివ‌రీ అయ్యే స‌మ‌యంలోనే బాక్స్‌ను వినియోగ‌దారులు డెలివ‌రీ బాయ్ స‌మ‌క్షంలోనే ఓపెన్ చేసి చూడ‌వ‌చ్చు.

అలా ఓపెన్ చేశాక వ‌స్తువు ఉంటే ఓకే.. లేదంటే దాన్ని అలాగే అప్ప‌టికప్పుడే రిట‌ర్న్ పంపి రీఫండ్ పొంద‌వ‌చ్చు. నిజానికి ఇది ఎంతో మంచి స‌దుపాయం. కానీ ఇలా ఉన్న‌ప్ప‌టికీ తాజాగా ఓ వ్య‌క్తికి ఐఫోన్ ఆర్డ‌ర్ చేస్తే స‌బ్బు బిళ్ల వ‌చ్చింది. వివ‌రాల్లోకి వెళితే..

కేర‌ళ‌లోని కొచ్చి పట్టణానికి చెందిన నూరుల్ అమీన్ ఇటీవల అమెజాన్ లో ఐఫోన్-12 బుక్ చేశాడు. రూ. 70,900 ముందుగానే చెల్లించాడు. అమెజాన్ పే ద్వారా చెల్లింపు చేశాడు. ఈ క్ర‌మంలో అమెజాన్ డెలివ‌రీ బాయ్ ఫోన్ ను ఇవ్వ‌గా.. దాన్ని నూరుల్ ఓపెన్ చేసి చూశాడు. అందులో విమ్ బార్ ఉంది. దీంతో షాకైన నూరుల్ వెంట‌నే దాన్ని అలాగే ఆ డెలివ‌రీ బాయ్‌తో తిప్పి పంపేశాడు.

అయితే ఐఫోన్ 12 ఫోన్లు త‌మ వ‌ద్ద స్టాక్ లేనందున అత‌ను చెల్లించిన మొత్తాన్ని అమెజాన్ రీఫండ్ చేసింది. ఈ క్ర‌మంలో అస‌లు పొర‌పాటు ఎక్క‌డ జ‌రిగిందో విచారించే స‌రికి.. షాక్ లాంటి నిజం బ‌య‌ట ప‌డింది. ఆ ఫోన్‌కు చెందిన ఐఎంఈఐ ద్వారా ట్రేస్ చేయ‌గా.. దాన్ని జార్ఖండ్‌లో ఉప‌యోగిస్తున్న‌ట్లు వెల్ల‌డైంది. అయితే నిజానికి ఆఫోన్ సెప్టెంబ‌ర్ నుంచే వినియోగంలో ఉంది. కానీ దాన్ని అక్టోబ‌ర్‌లో అమ్మ‌కానికి పెట్టారు. అంటే.. ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఎవ‌రో వాడుతున్న ఫోన్‌ను అమ్మ‌కానికి పెట్టారు. కానీ ఫోన్‌ను అందులో ఉంచకుండా.. విమ్ బార్ పెట్టారు. దీంతో ఆ బాక్స్ అలాగే డెలివ‌రీ అయింది. అంటే.. ఇది డెలివరీ బాయ్ త‌ప్పిదం కాద‌ని, అమ్మ‌కం దారు త‌ప్పిద‌మేన‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. మ‌రి ఈ త‌ర‌హా మోసాల‌కు ఈ-కామర్స్ సంస్థ‌లు ఎలా చెక్ పెడ‌తాయో చూడాలి.

ఏది ఏమైనా.. మీరు కూడా ఆన్‌లైన్‌లో ఫోన్‌కు ఆర్డ‌ర్ పెడితే.. డెలివ‌రీ బాయ్ ఎదుటే బాక్స్ ఓపెన్ చేసేలా స‌దుపాయాన్ని ఎంచుకోండి. లేదంటే ఇబ్బందులు ఏర్ప‌డితే ఇచ్చిన సొమ్ము మొత్తం వెన‌క్కి వ‌చ్చేందుకు చాలా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM