Prabhas : బాహుబలి రెండు పార్ట్‌లు, తరువాత సాహో మూవీకి చాలా సమయం తీసుకున్న ప్రభాస్.. ఇప్పుడు స్పీడు పెంచాడు. వరుసగా ప్రాజెక్టులకు ఓకే చెబుతున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ సినిమాలు రానున్న రోజుల్లో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక ప్రభాస్ జీవితానికి చెందిన కొన్ని ఎవరికీ తెలియని సీక్రెట్స్‌ను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. అయితే ప్రభాస్ తొలి హిందీ మూవీ బాహుబలినే అనుకుంటారు. కానీ కాదు.. అంతకన్నా ముందే యాక్షన్ జాక్సన్ అనే సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్‌లో నటించాడు. ఇక ప్రభాస్ కు అసలు హీరో అవ్వాలనే ఉద్దేశమే లేదట. బిజినెస్ చేసుకుందామని అనుకున్నాడట. కానీ అనుకోకుండా హీరో అయ్యాడు. తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.
ప్రభాస్‌కు రకరకాల భోజనాలు అంటే ఇష్టం. మరీ ముఖ్యంగా.. బిర్యానీ అంటే ఎంతో ఇష్టం. చికెన్, మటన్, ప్రాన్స్.. ఇలా భిన్న రకాల బిర్యానీలను తింటాడు. బాహుబలి మూవీ సందర్బంగా రోజుల తరబడి డైట్ పాటిస్తూనే మధ్యలో చీట్ డే పేరిట ఒక రోజంతా తనకు ఇష్టమైన బిర్యానీలను తిని గడిపాడు. అలా ఒక రోజైతే ఏకంగా 15 రకాల బిర్యానీలను తిన్నాడట.
ప్రభాస్ అంత ఫిట్‌గా ఉండేందుకు కారణం.. లక్ష్మణ్ రెడ్డి అనే ట్రెయినర్. ఈయన 2010లో లాస్ వెగాస్ లో జరిగిన మిస్టర్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచాడు. కాగా ఈయనకు ప్రభాస్ ఇటీవల అత్యంత ఖరీదైన రేంజ్ రోవర్ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. ప్రభాస్ తనకు ఎవరైనా ఇష్టం అయితే వాళ్లను డార్లింగ్ అని పిలుస్తాడు. ఫ్యాన్స్ ను కూడా అలాగే పిలుస్తాడు. ఇక లక్ష్మణ్ కూడా అలాగే పిలుచుకుంటాడు.
ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ విజేత రాబర్ట్ డెనిరో అంటే ప్రభాస్ కు ఎంతో ఇష్టం. బాలీవుడ్ లో రాజ్ కుమార్ హిరాణీ సినిమాలు చూస్తాడు. తన ఇంటికి ఎవరొచ్చినా కడుపునిండా భోజనం పెట్టి పంపిస్తాడు. మర్యాదలకు ఎలాంటి లోటు రానివ్వడు. ప్రభాస్ తో నటించిన హీరోయిన్లంతా అతడి ఆత్మీయత, ఆతిథ్యానికి ముచ్చట పడుతుంటారు. రకరకాల వంటల్ని ప్రత్యేకంగా తయారుచేయించి మరీ హీరోయిన్లకు ప్రభాస్ తానే స్వయంగా దగ్గరుండి మరీ వడ్డిస్తుంటాడు. ఇలా ప్రభాస్ అందరినీ తన సొంత వాళ్లలా చూస్తాడు. అందుకనే ఇండస్ట్రీలో అందరికీ ప్రభాస్ అంటే ఎంతో ఇష్టం.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…