Prakash Raj : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల రచ్చ ఇంకా ముగియలేదు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల మధ్య మా ఎన్నికలు జరిగాయి. రసవత్తరంగా సాగిన ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు విజయం సాధించి మా అధ్యక్ష పీఠాన్ని వరించాడు. మంచు ప్యానల్ సభ్యులు ఎన్నికలలో రిగ్గింగ్ చేశారని.. సీసీ టీవీ ఫుటేజ్ తమకు అందించాలని ప్రకాష్ రాజ్ ప్యానల్ ఆరోపిస్తోంది.
తాజాగా ప్రకాశ్ రాజ్.. రౌడీషీటర్లు ‘మా’ ఎన్నికల్ని ప్రభావితం చేశారని ఆరోపించారు. ఇదే విషయాన్ని మరోసారి ఈసీ కృష్ణమోహన్ దృష్టికి తీసుకెళ్లారు. పోలింగ్ రోజున జరిగిన తిట్లదండకం, బెదిరింపులకి సంబంధించి సీసీ ఫుటేజ్ ఇవ్వాలని ఇప్పటికే కోరారు. ఇప్పుడు మరోసారి రౌడీషీటర్ల పాత్ర ఉందంటూ లేఖాస్త్రం సంధించారు. ఈ వివాదంపై ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ వివరణ ఇచ్చారు.
ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించడం వరకు మాత్రమే నా ప్రమేయం. తరువాత పరిణామాలతో నాకు ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే ప్రకాష్ రాజ్ నుండి తాజాగా ఎలాంటి లెటర్ రాలేదని అన్నారు కృష్ణ మోహన్. అయితే ప్రకాష్ రాజ్ ఇలా సీసీటీవీ ఫుటేజ్ అడగడం రెండోసారి. అయినప్పటికీ ఎన్నికల అధికారి తనకు సంబంధం లేదని మరోమారు చెప్పేశారు. మరి ప్రకాష్ రాజ్ ఏం చేస్తారో చూడాలి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…