Prakash Raj : ప్రకాష్‌ రాజ్‌కు షాక్‌.. మళ్లీ నిరాశ తప్పలేదు..!

October 23, 2021 11:42 AM

Prakash Raj : మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేష‌న్ ఎన్నిక‌ల రచ్చ ఇంకా ముగియ‌లేదు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల మధ్య మా ఎన్నికలు జరిగాయి. రసవత్తరంగా సాగిన ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు విజయం సాధించి మా అధ్యక్ష పీఠాన్ని వరించాడు. మంచు ప్యానల్ సభ్యులు ఎన్నికలలో రిగ్గింగ్ చేశారని.. సీసీ టీవీ ఫుటేజ్ తమకు అందించాలని ప్రకాష్ రాజ్ ప్యానల్ ఆరోపిస్తోంది.

elections officer krishna mohan given reply to Prakash Raj

తాజాగా ప్ర‌కాశ్ రాజ్.. రౌడీషీటర్లు ‘మా’ ఎన్నికల్ని ప్రభావితం చేశారని ఆరోపించారు. ఇదే విషయాన్ని మరోసారి ఈసీ కృష్ణమోహన్‌ దృష్టికి తీసుకెళ్లారు. పోలింగ్ రోజున జరిగిన తిట్లదండకం, బెదిరింపులకి సంబంధించి సీసీ ఫుటేజ్‌ ఇవ్వాలని ఇప్పటికే కోరారు. ఇప్పుడు మరోసారి రౌడీషీటర్ల పాత్ర ఉందంటూ లేఖాస్త్రం సంధించారు. ఈ వివాదంపై ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ వివరణ ఇచ్చారు.

ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించడం వరకు మాత్రమే నా ప్రమేయం. తరువాత పరిణామాలతో నాకు ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే ప్రకాష్ రాజ్ నుండి తాజాగా ఎలాంటి లెటర్ రాలేదని అన్నారు కృష్ణ మోహన్. అయితే ప్రకాష్‌ రాజ్‌ ఇలా సీసీటీవీ ఫుటేజ్‌ అడగడం రెండోసారి. అయినప్పటికీ ఎన్నికల అధికారి తనకు సంబంధం లేదని మరోమారు చెప్పేశారు. మరి ప్రకాష్‌ రాజ్‌ ఏం చేస్తారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now