Money : దారుణం.. ఆ పనిచేస్తే గంటకు రూ.3వేలు వస్తాయని ఆశపడి.. రూ.17 లక్షలు పోగొట్టుకున్నాడు..!

April 8, 2022 5:26 PM

Money : అపరిచిత వ్యక్తులు చెప్పే మాటలను నమ్మి మోసపోవద్దని.. ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెబుతూ డబ్బులు వసూలు చేసే వారిని అసలే నమ్మవద్దని.. పోలీసులు ఎంత చెబుతున్నా.. కొందరు మాత్రం వినిపించుకోవడం లేదు. ఫలితంగా లక్షల రూపాయలను పోగొట్టుకుంటున్నారు. ఎంతో కష్టపడి సంపాదించే సొమ్మును నేరస్థుల పాలు చేస్తున్నారు. తాజాగా పూణెలో ఓ వ్యక్తి కూడా ఇలాగే చేశాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

man lost Rs 17 lakhs money for fraudsters for job offer
Money

పూణెకు చెందిన ఓ వ్యక్తి (27) తండ్రి కరోనా వల్ల చనిపోయాడు. ఈ క్రమంలోనే తన వద్ద ఉన్న రూ.17 లక్షలు తన కొడుక్కి వచ్చాయి. అయితే ఆ డబ్బుతో అతను ఏదైనా వ్యాపారం చేసుకున్నా బాగుపడేవాడు కావచ్చు. కానీ అతను అలా అనుకోలేదు. అత్యాశకు పోయాడు. మేల్‌ ఎస్కార్ట్‌ సర్వీస్‌ (మగ వ్యభిచారులు) చేస్తే గంటకు రూ.3వేలు సంపాదించవచ్చని చెబుతూ ఆన్‌లైన్‌లో కనిపించిన ఓ యాడ్‌ను చూసి మోసపోయాడు.

సదరు యాడ్‌లో ఇచ్చిన ఫోన్‌ నంబర్లకు ఆ వ్యక్తి ముందుగా కాల్‌ చేయగా.. వారు ఆ పని అప్పగించేందుకు గాను కొన్ని రకాల చార్జిలు అవుతాయని చెప్పారు. సర్వీస్‌ చార్జి, రూమ్‌ చార్జి, పోలీస్‌ వెరిఫికేషన్‌ చార్జి, పికప్‌ చార్జ్‌.. అని చెప్పి పలు దఫాల్లో లక్షల రూపాయలను ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నారు. ఇలా మొత్తం రూ.17.38 లక్షల వరకు ఆ వ్యక్తి వారికి ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. చివరికి వారు ఫోన్‌ స్విచాఫ్‌ చేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

అయితే తన తండ్రి చనిపోవడం వల్ల అతను దాచుకున్న రూ.17 లక్షలు ఆ వ్యక్తికి వచ్చినా.. అతను వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. డబ్బును తీస్తుంటే అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆ డబ్బును ఏం చేస్తున్నావని అడిగారు. ఇందుకు ఆ వ్యక్తి.. షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెడుతున్నానని చెబుతూ వచ్చాడు. చివరకు ఇలా చేశాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులు జరిగిన విషయం తెలుసుకుని హతాశులయ్యారు. కాగా ఆ వ్యక్తి నగదు ట్రాన్స్‌ఫర్‌ చేసిన అకౌంట్ల వివరాలను సేకరించిన పోలీసులు అవి ఎవరివో తెలుసుకునే పనిలో పడ్డారు. ఎవరూ ఇలా నమ్మి మోసపోవద్దని పోలీసులు మరోమారు హెచ్చరించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now