Viral Video : వెన్నులో వ‌ణుకు పుట్టించే వీడియో.. టూవీల‌ర్‌తో స‌హా గోతిలో ప‌డిన వ్య‌క్తి..

August 12, 2022 1:18 PM

Viral Video : రోడ్డుపై మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ప్రమాదాలు ఊహించని విధంగా జరుగుతూనే ఉంటాయి. అందుకు ఈ వీడియోనే నిదర్శనం. ఓ వ్యక్తి.. రోడ్డు మీద తన బైక్ ని రివర్స్ చేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలో వెనక్కి చూసుకోకపోవడం వల్ల పెద్ద గుంత‌లో పడిపోయాడు. ప్రస్తుతం ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే..

ఈ మధ్యకాలంలో పడిన భారీ వర్షాలకు రోడ్లు దారుణంగా మారిపోయాయి. ఏ రోడ్డుపై ఎక్కడ గుంత ఉంటుందో మనం చెప్పలేం. మనమే.. ఇలాంటి విషయాల‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహ‌నం ముందుకు వెళ్తున్నా.. వెనక్కి తీస్తున్నా.. రోడ్డు ఎలా ఉంటుందో చూసుకోవాలి. లేకపోతే.. ఇలాగే అవుతుంది. ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఓ వీడియో.. వాహనదారులను విపరీతంగా భయపెడుతోంది.

man fell into pit with two wheeler Viral Video
Viral Video

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను వై మెన్ లివ్ లెస్ అనే పేజీలో ట్వీట్ చేశారు. మోటారు సైకిల్ నడుపుతున్న వ్యక్తిని వీడియోలో చూడవచ్చు. ఓ దుకాణం ముందు నిలబడి తన వాహనాన్ని రివర్స్‌ చేస్తున్నాడు. అతని వెనుక ఉన్న గుంతను అతను చూసుకోలేదు. నేరుగా వెళ్లి అతను భారీ గుంత‌లో పడిపోయాడు. జర్నీ ఆఫ్ ది ఎర్త్ అని వ్యంగ్యంగా క్యాప్షన్‌తో ట్విట్టర్‌లో వీడియోను పోస్ట్ చేశారు.

https://twitter.com/Menliveless/status/1556342724621893632

ఈ వీడియోకి ఇప్పటి వరకు 1.30 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. మరికొందరు ఆ వీడియో చూసి నవ్వుకుంటున్నారు. దీనిపై ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. అసలు అతను మరో విశ్వంలోకి వెళ్తున్నాడు, అందుకే వెనక్కు వెళ్తున్నాడు.. అంటే.. మరో ట్విట్ట‌ర్ యూజర్ దీనిపై కామెంట్ చేస్తూ.. నిగూఢ పరిస్థితుల్లో అదృశ్యమయ్యాడు.. అని కామెంట్ చేశాడు. ఇక ఈ వీడియోపై కామెంట్ల వర్షం కురుస్తూనే ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now