Bolero : రూ.12 ల‌క్ష‌లను నాణేల రూపంలో ఇచ్చి కారు కొన్నాడు.. వీడియో..!

March 28, 2022 9:02 PM

Bolero : వాహ‌నాలను కొనేవారు ఎవ‌రైనా స‌రే క్యాష్ లేదా డిజిట‌ల్ రూపంలో చెల్లింపులు చేస్తారు. ఒక వేళ ఫైనాన్స్ తీసుకున్నా స‌రే.. డౌన్ పేమెంట్‌ను కూడా క్యాష్ లేదా డిజిట‌ల్ రూపంలో చెల్లిస్తారు. ఎక్కువ విలువ గ‌ల నోట్ల‌ను లేదా డిజిట‌ల్ రూపంలో న‌గ‌దును ఇచ్చి వాహ‌నాల‌ను కొనుగోలు చేస్తారు. కానీ ఆ వ్య‌క్తి మాత్రం ఏకంగా రూ.12 ల‌క్ష‌ల‌ను నాణేల రూపంలో ఇచ్చాడు. దీంతో ఆ నాణేల‌ను లెక్క పెట్టేస‌రికి షోరూం సిబ్బందికి త‌ల‌ప్రాణం తోక‌కు వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు కౌంటింగ్ పూర్తి చేసిన షోరూం సిబ్బంది ఆ వ్య‌క్తికి కారును ఇచ్చేశారు.

man bought Bolero car by giving rs 12 lakhs in coins
Bolero

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్య‌క్తి మ‌హీంద్రా షోరూంకు వెళ్లి బొలెరో ధ‌ర ఎంత ఉందో ఎంక్వ‌యిరీ చేశాడు. ఈ కారు మోడ‌ల్ బేసిక్ వేరియెంట్ ధ‌ర రూ.8.99 ల‌క్ష‌ల‌కు ప్రారంభ‌మ‌వుతుంది. గ‌రిష్టంగా దీని ధ‌ర రూ.12 ల‌క్ష‌లుగా ఉంది. అయితే అత‌ను రూ.12 ల‌క్ష‌ల వేరియెంట్‌ను కొన్నాడు. ఇక పేమెంట్ మొత్తాన్ని నాణేల రూపంలో చెల్లించాడు. దీంతో సిబ్బందికి లెక్క పెట్ట‌డం క‌ష్ట‌మైంది. అయితే చివ‌ర‌కు వారు కౌంటింగ్ పూర్తి చేసి పేప‌ర్ వ‌ర్క్ కానిచ్చి.. ఆపై ఆ వాహ‌నాన్ని అత‌నికి డెలివ‌రీ ఇచ్చేశారు. ఈ క్ర‌మంలోనే ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

కాగా బొలెరో వాహ‌నం ప్ర‌స్తుతం బీఎస్‌6 మోడ‌ల్‌లో ల‌భిస్తోంది. ఇందులో 1.5 లీట‌ర్ల త్రీ సిలిండ‌ర్ ఎం-హాక్ డీజిల్ ఇంజిన్ ను ఏర్పాటు చేశారు. ఇది గ‌రిష్టంగా 75 హార్స్ ప‌వ‌ర్‌ను అందిస్తుంది. ప్ర‌స్తుతం బొలెరో వాహ‌నం బి4, బి6, బి6 (ఓ) మోడల్స్‌లో ల‌భిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now