Hyper Aadi : హైపర్ ఆది చేసిన ఆ పనికి.. మల్లెమాల స్ట్రాంగ్ వార్నింగ్..?

October 20, 2022 9:40 AM

Hyper Aadi : జబర్దస్త్ కామెడీ షో ఎంతోమంది ఆర్టిస్ట్ లకు జీవితాన్ని ఇచ్చిందన్న విషయం తెలిసిందే. ఇందులో గుర్తింపు పొందిన అనేకమంది ఆర్టిస్టులు సినిమాల్లో కూడా నటిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అయితే కొన్ని కారణాలతో గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది జబర్దస్త్ నుంచి తప్పుకున్నారు. అయితే హైపర్ ఆది రీఎంట్రీ ఇవ్వడంతో జబర్దస్త్ షో కళకళలాడుతోంది. కమెడియన్స్ అంతా తమదైన శైలిలో ఆకట్టుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం అలా తిరిగి రాలేదు. పౌరుషంగా అక్కడే ఉంటూ జబర్దస్త్ షోని మించి పోయేలా కొత్త షోలు రావడానికి ట్రై చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రముఖ ఛానల్ ఈటీవీలో వర్క్ చేస్తున్న స్టార్ కమెడియన్స్ ని ఆ షోలో పని చేస్తున్న జడ్జీలని మెల్లగా వాళ్ళ వైపులా తిప్పుకునేందుకు భారీ ఆఫర్స్ ఇస్తుంది ఓ స్టార్ ఛానెల్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే జబర్దస్త్ లో టాప్ కమెడియన్ గా ఉంటున్న హైపర్ ఆదిపై ఆ ఛానల్ కళ్ళు పడ్డాయట. దీంతో అతనికి భారీ పారితోషకం ఆఫర్ చేస్తూ ఈటీవీని వదిలి వచ్చేసి మా ఛానల్ లో పనిచేయాలి అంటూ హైపర్ ఆదిని కోరారట.

mallemala unit reportedly given warning to Hyper Aadi
Hyper Aadi

అయితే హైపర్ ఆది యస్, నో ఏదీ చెప్పకుండా.. టైం కావాలి అన్నట్లు చెప్పుకొచ్చాడట. ఈ మ్యాటర్ తెలుసుకున్న మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ హైపర్ ఆదిని పిలిచి వార్నింగ్ ఇచ్చిందట. అంతేకాదు నువ్వు షో వదిలి వెళ్ళడానికి వీల్లేదు.. అగ్రిమెంట్ పేపర్స్ పై సైన్ చేసావ్ గుర్తుంది కదా అంటూ హెచ్చరిచిందట. అంతేకాదు.. వాళ్లకు మించిపోయే ఆఫర్ ను ఇవ్వడానికి సిద్ధపడిన్నట్లు తెలుస్తుంది. దీంతో హైపర్ ఆది ఆ ఛానల్ లోకి వెళ్తాడా లేక ఈ ఛానల్ లోనే ఉంటాడా లేదా.. గోడ మీద పిల్లిలా అటు ఇటు మారుతూ ఉంటాడా..? అంటూ కొందరు నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now