Chicken Fry : చికెన్ పేరు చెప్పగానే మాంసాహారుల నోళ్లలో నీళ్లూరతాయి. చికెన్ అంటే అంతటి ఇష్టం ఉంటుంది. అందుకని చికెన్‌ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. దీంతో అనేక రకాల వెరైటీలను చేస్తుంటారు. వాటిల్లో చికెన్ ఫ్రై ఒకటి. అయితే కాస్త శ్రమించాలే కానీ.. ఇంట్లోనే చాలా సులభంగా చికెన్ ఫ్రై ని అదిరిపోయే టేస్ట్‌తో వండుకోవచ్చు. మరి చికెన్ ఫ్రై ని ఎలా వండాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
చికెన్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – కిలో, తరిగిన ఉల్లిపాయలు – 3 (మధ్యస్థంగా ఉన్నవి), పసుపు – అర టీ స్పూన్, ధనియాలు – ఒకటిన్నర టేబుల్ స్పూన్స్, మిరియాలు – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 10, అల్లం ముక్కలు- కొద్దిగా, లవంగాలు – 5, దాల్చిన చెక్క ముక్కలు – 2 (చిన్నవి), పొడుగ్గా తరిగిన పచ్చి మిర్చి – 4, ఉప్పు – రుచికి సరిపడా, కారం – ఒక టీ స్పూన్, కచ్చా పచ్చాగా చేసిన వెల్లుల్లి రెబ్బలు – 6, కరివేపాకు రెబ్బలు – 2, నూనె – 3 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
చికెన్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో ధనియాలను వేసి వేయించుకుని, జార్ లో వేసుకుని పొడిలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే జార్ లో మిరియాలను వేసి బరకగా చేసి దీనిని కూడా పక్కన పెట్టుకోవాలి. మళ్లీ అదే జార్ లో అల్లం, వెల్లుల్లి రెబ్బలు, లవంగాలు, దాల్చి చెక్క ముక్కలు వేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి కాగాక కడిగిన చికెన్ ను, తరిగిన ఉల్లిపాయ ముక్కలను, పసుపు, కొద్దిగా ఉప్పు, ఒక రెబ్బ కరివేపాకును వేసి కలిపి మధ్యస్థ మంటపై.. మూత పెట్టి చికెన్ ను ఉడికించుకోవాలి. తరువాత మరో కళాయిలో నూనె వేసి కాగాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 2 తరిగిన పచ్చి మిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి.
ఉల్లిపాయలు కొద్దిగా వేగాక ముందుగా ఉడికించుకున్న చికెన్ ను వేసి మధ్యస్థ మంటపై చికెన్ ముక్కలు ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. తరువాత కారం, కచ్చా పచ్చాగా చేసిన వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చి మిర్చి వేసి కలుపుకోవాలి. తరువాత ముందుగా చేసి పెట్టుకున్న ధనియాల పొడిని, మిరియాల పొడిని వేసి కలుపుకోవాలి. చివరగా తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రై తయారవుతుంది. దీనిని నేరుగా లేదా పప్పు, సాంబార్ వంటి వాటితో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…