Maheshwari : రామ్ గోపాల్ వ‌ర్మ న‌న్ను మోసం చేశారు.. షాకింగ్ విష‌యాల‌ను వెల్లడించిన మ‌హేశ్వ‌రి..!

January 26, 2022 9:36 PM

Maheshwari : ఒక‌ప్పుడు హీరోయిన్ మ‌హేశ్వ‌రి న‌టిగా ఎంత‌టి పేరును సంపాదించుకుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె అప్ప‌ట్లో న‌టించిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. ఓ ద‌శ‌లో టాప్ రేంజ్‌కు కూడా చేరుకుంది. అయితే అంద‌రు హీరోయిన్ల‌లాగే ఈమె కూడా కొంత‌కాలానికి తెర‌మ‌రుగు అయిపోయింది. ఇక తాజాగా ఈమె మ‌రోమారు తెర‌పై క‌నిపించి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

Maheshwari said ram gopal varma cheated her at that time

ఒక‌ప్పుడు ఎంతో గ్లామ‌ర్‌గా ఉన్న మ‌హేశ్వ‌రి ఇప్పుడు మాత్రం బాగా లావుగా అయి ద‌ర్శ‌న‌మిస్తోంది. అయితే తాజాగా అలీతో షోలో పాల్గొన్న మ‌హేశ్వ‌రి త‌న సినీ జీవితంలో చోటు చేసుకున్న ప‌లు ఆసక్తిక‌ర‌మైన సంఘ‌ట‌న‌ల గురించి తెలియ‌జేసింది.

అప్ప‌ట్లో జేడీ చక్ర‌వ‌ర్తి హీరోగా, మ‌హేశ్వ‌రి హీరోయిన్‌గా రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన దెయ్యం మూవీ ఎంత‌టి హిట్ గా నిలిచిందో అంద‌రికీ తెలిసిందే. అయితే ఆ మూవీ షూటింగ్ స‌మ‌యంలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న గురించి మ‌హేశ్వ‌రి తెలియ‌జేసింది.

అప్ప‌ట్లో దెయ్యం మూవీ షూటింగ్ మేడ్చ‌ల్‌లోని ఓ పాడుబ‌డిన బిల్డింగ్‌లో జ‌రిగింది. షూటింగ్ కోసం అక్క‌డ ప్ర‌త్యేకంగా శ్మ‌శానం సెట్ వేశారు. అక్క‌డి నుంచి మెయిన్ రోడ్డుకు సుమారుగా 2 కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది. షూటింగ్ రాత్రి 1 గంట‌కు జ‌రుగుతోంది.

అయితే షూటింగ్ లొకేష‌న్ నుంచి 2 కిలోమీట‌ర్లు న‌డిచి వెళ్లి మెయిన్ రోడ్డుకు చేరుకుని తిరిగి వెన‌క్కి రావాలి. ఇదీ పందెం. అలా వెళ్లి వ‌చ్చిన వారికి రూ.50వేలు ఇస్తాన‌ని వ‌ర్మ చెప్పారు. ఈ క్ర‌మంలో చాలెంజ్ స్వీక‌రించిన మ‌హేశ్వ‌రి భ‌య‌ప‌డుతూనే అలా వెళ్లి వ‌చ్చింద‌ట‌. అయిన‌ప్ప‌టికీ వ‌ర్మ తాను చెప్పిన‌ట్లు రూ.50వేలు ఇవ్వ‌లేద‌ట‌. ఇదే విష‌యాన్ని ఆమె తాజాగా చెబుతూ వ‌ర్మ అలా త‌న‌ను మోసం చేశార‌ని చెప్పుకొచ్చింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now