Naresh : న‌రేష్ వ్య‌వ‌హారంపై మ‌హేష్ బాబు అసంతృప్తి.. ప‌ర్స‌న‌ల్‌గా అలా చెప్పార‌ట‌..?

July 14, 2022 10:36 PM

Naresh : గ‌త కొద్ది రోజులుగా న‌రేష్, ప‌విత్ర లోకేష్‌ల వ్య‌వ‌హారం ఎంత సంచ‌ల‌నాన్ని సృష్టించిందో అంద‌రికీ తెలిసిందే. వీరు మైసూర్‌లోని ఒక హోటల్‌లో ర‌మ్య ర‌ఘుప‌తికి ప‌ట్టుబ‌డ్డారు. ఈ క్ర‌మంలోనే వివాదం మ‌రింత ముదిరింది. హోట‌ల్ గ‌ది నుంచి బ‌య‌ట‌కు వ‌స్తుండ‌గా.. ప‌విత్ర‌ను ర‌మ్య చెప్పుతో కొట్ట‌బోయింది. కానీ అప్పుడు అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకుని వారికి స‌ర్ది చెప్పి అక్క‌డి నుంచి పంపించివేశారు. ఆ స‌మ‌యంలోనే న‌రేష్ త‌న భార్య ర‌మ్య‌ను చూస్తూ విజిల్స్ వేస్తూ అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. అయితే ప‌విత్ర‌తో అలా ప‌ట్టుబ‌డ‌డ‌మే కాకుండా.. తానేదో పెద్ద ఘ‌న‌కార్యం చేసిన‌ట్లు విజిల్స్ వేసుకుంటూ పోయాడ‌ని న‌రేష్‌ను నెటిజన్లు ట్రోల్ చేశారు.

ఇక ఈ వ్య‌వ‌హారంపై సూప‌ర్ స్టార్ కృష్ణ కూడా అసంతృప్తిగానే ఉన్నట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఆయ‌న‌కు తెలిసే తాము ఇదంతా చేస్తున్నామ‌ని అంత‌కు ముందు ప‌విత్ర లోకేష్ స్వ‌యంగా మీడియా ముందు చెప్పేసింది. దీంతో కృష్ణ పేరు ఇందులో ఇన్వాల్వ్ అయింది. అయితే కృష్ణ న‌రేష్ వ్య‌వ‌హారంపై అసంతృప్తిగా ఉన్నార‌ట‌. ఆయ‌న న‌రేష్‌ను మంద‌లించిన‌ట్లు కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఇక తాజాగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కూడా న‌రేష్‌తో ప‌ర్స‌నల్‌గా మాట్లాడార‌ట‌. ఈ క్ర‌మంలోనే న‌రేష్‌కు మ‌హేష్ ఒక రిక్వెస్ట్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

Mahesh Babu spoken with Naresh for his matter
Naresh

మీకు ఏమైనా ఇలాంటి వ్య‌వ‌హారాలు ఉంటే కూర్చుని ప‌రిష్కారం చేసుకోండి.. కానీ ఇలా ఫ్యామిలీ విష‌యాల‌ను బ‌య‌టకు తీయ‌వ‌ద్దు.. అంటూ మ‌హేష్‌.. న‌రేష్‌ను కోరార‌ట‌. ఈ క్ర‌మంలోనే ఈ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అయితే న‌రేష్‌కు మ‌హేష్ నిజంగానే రిక్వెస్ట్ చేశారా.. లేదా.. అన్న‌ది తెలియ‌దు కానీ.. న‌రేష్ వ్య‌వ‌హారం మాత్రం రోజు రోజుకీ ముదిరి పాకాన‌ప‌డుతోంది. మ‌రి దీనికి ముగింపు ఎప్పుడు ఇస్తారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now