Mahesh Babu : కృష్ణ పెద్ద కర్మకు 32 రకాల వంటకాలతో అభిమానులకు విందు ఏర్పాటు చేసిన మహేష్ బాబు

November 28, 2022 1:36 PM

Mahesh Babu : సూపర్‌స్టార్‌ కృష్ణ మరణాన్ని ఆయన కుటుంబంతో పాటు అభిమానులు కూడా ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు. 350కు పైగా చిత్రాల్లో నటించి అలరించిన కృష్ణ ఆయన సినీ కెరిర్లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ నెల నవంబర్ 15న కృష్ణ గుండెపోటుతో కన్నుమూశారు. ఈ నవంబర్‌ 27న హైదరాబాద్‌లో సూపర్‌స్టార్‌ కృష్ణ దశ దిన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు రెండు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు దశ దిన కర్మకు తరలి వచ్చారు

సూపర్ సార్ కృష్ణ ఆత్మకు శాంతి కలగాలని ఈ ఆదివారం  కృష్ణ పెద్ద కర్మను ఇంటి వద్ద శాస్త్రోక్తంగా పూజలు జరిపి మహేష్ బాబు నిర్వహించారు. ఆ తరవాత మధ్యాహ్నం వచ్చిన అతిథులకు విందు ఏర్పాటు చేశారు. పెద్ద కర్మకు విచ్చేసే అతిథుల కోసం రెండు వేదికలను మహేష్ బాబు ఏర్పాటు చేశారు. సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ఎన్ కన్వెషన్‌లో, అభిమానుల కోసం జేఆర్సీ కన్వెన్షన్‌లో విందు ఏర్పాటు చేశారు.

Mahesh Babu put 32 types of dishes for krishna pedda karma
Mahesh Babu

అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తారని భావించిన మహేష్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పాస్ సిస్టమ్ పెట్టారు. అభిమానుల కోసం 5వేల పాసులను పంపిణీ చేశారు. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే జేఆర్సీ కన్వెన్షన్‌లోకి అనుమతించారు. అభిమానుల కోసం 32 రకాల వంటకాలను మహేష్ బాబు సిద్ధం చేయించారు.

జేఆర్సీ కన్వెన్షన్‌లో భోజనం చేసిన కొందరు అభిమానులు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. మహేష్ గారు మా కోసం 32 ఐటెమ్స్ పెట్టించారు అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంటి వద్ద పెద్ద కర్మకు సంబంధించిన కార్యక్రమాలు పూర్తికాగానే మహేష్ బాబు.. అభిమానులను పలకరించేందుకు చిన్నాన్న ఆదిశేషగిరిరావుతో కలిసి జేఆర్సీ కన్వెన్షన్‌కు వెళ్లారు. అక్కడ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. తన తండ్రి తనకు ఇచ్చిన గొప్ప ఆస్తి అభిమానులు అని.. ఈ విషయంలో తన తండ్రికి రుణపడి ఉంటానని మహేష్ బాబు అన్నారు. పెద్ద కర్మకు వచ్చినవారంతా భోజనం చేసి సురక్షితంగా ఇళ్లకు తిరిగి వెళ్లాలని కోరారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now