Mahesh Babu : మొదటి షోతోనే ఫ్లాప్ టాక్ అందుకొని.. చివరకు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మహేష్ బాబు సినిమా ఏదో తెలుసా..?

August 20, 2022 9:57 AM

Mahesh Babu : రాజకుమారుడు చిత్రంతో తెలుగు తెరకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. కృష్ణ నటవారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయినా కూడా తన అద్భుతమైన నటనా ప్రతిభతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కృష్ణ కొడుకు మహేష్ బాబు అనే పేరును చెరిపివేసి, మహేష్ బాబు తండ్రి కృష్ణ అని చెప్పే స్థాయికి ఎదిగాడు. మొదటి చిత్రమైన రాజకుమారుడుతో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు ఆ తర్వాత వచ్చిన యువరాజు, వంశీ ఆశించిన మేరకు విజయం సాధించలేకపోయాయి. అలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో మహేష్ బాబు మురారి చిత్రానికి కమిట్ అవ్వడం జరిగింది.

చావు కథాంశం చుట్టూ తిరిగే మురారి మహేష్ బాబుకు ఫ్లాప్ గా నిలుస్తుంది, మహేష్ బాబు ఇలాంటి రాంగ్ డెసిషన్ ఎలా తీసుకున్నాడు అంటూ ఇండస్ట్రీ విశ్లేషకులు మహేష్ ను తప్పుబ‌ట్టారు. ఎవరు ఎన్ని చెప్పినా మహేష్ బాబు మాత్రం చేస్తే ఇలాంటి కథ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. సినిమా మొదలు పెట్టిన తరువాత కూడా ఒక పాట విషయంలో నిర్మాతలు దేవిప్రసాద్, రామలింగేశ్వర రావు, కృష్ణవంశీల మధ్య మనస్పర్ధలు రావడం జరిగాయట. ఈ విషయంలో సూపర్ స్టార్ కృష్ణ కలగజేసుకుని సమస్యను రూపుమాపటం జరిగిందట. ఎన్నో కష్టాలు ఎదుర్కొని మురారి చిత్రం 2001 ఫిబ్రవరి 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Mahesh Babu Murari movie negative talk first but became hit
Mahesh Babu

విడుదలైన మొదటి రోజు మొదటి షో కి ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వెలువడింది. షోల‌ సంఖ్య పెరిగే కొద్దీ నెగెటివ్ టాక్ అందుకున్న ఈ చిత్రమే పాజిటివ్ టాక్ ను అందుకొని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. క్లాస్, మాస్ ఆడియన్స్ అని తేడా లేకుండా అన్ని సెంటర్లలో కూడా మురారి చిత్రానికి మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం జరిగింది. మురారి చిత్రం విడుదలయ్యి దాదాపు 20 సంవత్సరాలు అవుతున్న కూడా ఇప్పటికీ టీవీలో చూసే వీక్షకుల‌ను అంతగానే ఆకట్టుకుంటూ ఉంటుంది. మురారి చిత్రంలో అలనాటి బాలచంద్రుడు అనే పాట ఇప్పటికీ కూడా పెళ్ళి వేడుకలో వినిపిస్తూనే ఉంటుంది. అంత అద్భుతంగా మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now